హెల్త్ టిప్స్

Iron Foods : వీటిని రోజూ తిన్నారంటే చాలు.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..!

Iron Foods : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య వస్తోంది. మన శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి హిమోగ్లోబిన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి ఐరన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. రక్తహీనత సమస్య కారణంగా ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. అందువల్ల రక్తహీనత సమస్య లేకుండా చూసుకోవాలి.

రక్తహీనత సమస్య ఉన్నప్పుడు కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. సమస్య తీవ్రత ఉన్నప్పుడు ఇలా ఆహారం ద్వారా మనం ఐరన్ లోపాన్ని నివారించవచ్చు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే తొందరగా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

take these foods daily to cure from anemia

గుడ్లు, చేపలు, బీన్స్, పాలకూర, మునగాకు, చిలగ‌డదుంప, బ్రకోలి, బటాని, శనగలు, బీట్ రూట్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్ అందుతుంది. దీంతో రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. మాంసాహారం తినే వారైతే వారంలో రెండు సార్లు తీసుకోవాలి. అప్పుడు రక్తహీనత సమస్య ఉండదు. ఎప్పుడైనా సరే మన ఆహారంలో మార్పులను చేసుకుంటేనే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts