Omega 6 Fatty Acids : మన శరీరానికి కావల్సిన కీలక పోషక పదార్థాల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. ఇవి వెజిటబుల్ ఆయిల్స్‌లో మనకు లభిస్తాయి. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఒక రకమైన కొవ్వు జాబితాకు చెందినవి. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, సోయా బీన్ తదితర నూనెల్లో ఈ ఫ్యాట్లు ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలు, వేరుశెనగలు తదితర గింజల్లోనూ ఈ ఫ్యాట్లు మనకు లభిస్తాయి.
ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిక్ న్యూరోపతి సమస్య ఉన్న వారు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తింటే ఫలితం ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా అదుపులోకి వస్తాయి.
ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. మహిళలలో వచ్చే రుతు సమస్యలు పోతాయి. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. అవకాడోలు, చేపలు, ఆలివ్ నూనె, నట్స్ తినడం వల్ల కూడా ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు మనకు లభిస్తాయి.