Constipation : మనలో చాలా మందిని వేధించే జీర్ణ సంబంధిత సమస్యలల్లో మలబద్దకం కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. మారిన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. మలబద్దకం కారణంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. మలబద్దకం కారణంగా కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ సమస్య కారణంగా రోజంతా చురుకుగా ఉండలేకపోతాము. ఏ పనిని కూడా శ్రద్దతో చేయలేకపోతాము. మలబద్దకం సమస్యను తేలికగా తీసుకోకకూడదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మనం భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి ఉంటుంది. కనుక ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి.
మలబద్దకం సమస్యను తగ్గించడంలో మన తీసుకునే ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్దకం సమస్య తగ్గడంతో పాటు మరలా రాకుండాఉంటుందని వారు చెబుతున్నారు. పీచు పదార్థాలు ప్రేగులను చీపురు వలె శుభ్రం చేస్తాయని పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మలం గట్టిపడకుండా మెత్తగా ఉంటుందని అలాగే మలం ఎక్కువగా తయారవుతుందని దీంతో మలవిసర్జన సాఫీగా సాగుతుందని మలబద్దకం సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం సమస్యతో బాధపడే వారు లేత సొరకాయలను పొట్టుతో సహా కూర వండుకుని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరంలోకి పీచు పదార్థాలు ఎక్కువగా వెళ్తాయి. అలాగే లేత బీరకాయలను తొక్కతో సహా వండుకుని తీసుకోవాలి. అలాగే దోసకాయలను కూడా తొక్క, గింజలతో కూడా కూర వండుకుని తీసుకోవాలి. అలాగే లేత కూర అరటికాయలను తొక్కతో సహా కూర వండుకుని తీసుకోవాలి.
అలాగే క్యారెట్, కీరదోస వంటి వాటిని కూడా తొక్కతో సహా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణం కానీ పీచు పదార్థాలు మన శరీరంలోకి ఎక్కువగా వెళ్తాయి. దీంతో మలం గట్టిపడకుండా మెత్తగా ఉంటుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలవిసర్జన సాఫీగా సాగుతుంది. వీటితో పాటు తొక్క ఎక్కువగా ఉండే కమలా పండ్లను తీసుకోవాలి. పైన ఉండేతొక్కను, తెల్ల ఈనెలను తీసేసి కమలా పండ్లను పిప్పితో సహా బాగా నమిలి మింగాలి. రోజుకు 4 నుండి 5 కమలా పండ్లను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే దానిమ్మ గింజలను బాగా నమిలి మింగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇవే కాకుండా రాగులు, కొర్రలు, ఓట్స్ వంటి ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలి. రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. ఇలా తగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మలబద్దకంసమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.