శరీరంలో అప్పుడప్పుడు కొందరికి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతుంటాయి. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈ సమస్య ఒకప్పుడు కేవలం పెద్దల్లో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా ఈ సమస్య వస్తోంది. ఈ క్రమంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు డాక్టర్ సూచించిన మేర మందులను వాడాలి. దీంతోపాటు కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
1. మన ఇళ్లలో టమాటాలను నిత్యం అనేక కూరాల్లో వేస్తుంటాం. అయితే నిజానికి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో టమాటాలు అద్భుతంగా పనిచేస్తాయి. టమాటాలను నేరుగా తినాలి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవాలి. దీని వల్ల వాటిల్లో ఉండే ప్యూరిన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి.
2. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించేందుకు నిమ్మకాయలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మరసాన్ని తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. రోజూ భోజనానికి ముందు ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
3. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేందుకు ఆలివ్ ఆయిల్ కూడా పనిచేస్తుంది. వీలైనంత వరకు సాధారణ నూనెకు బదులుగా ఆలివ్ ఆయిల్ వాడాలి. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శరీరంలోని యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.
4. అధిక బరువును తగ్గించేందుకే కాదు, యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించేందుకు కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకుంటే యూరిక్ యాసిడ్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365