మీకు విటమిన్ సి లోపం ఉందా ? రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ ఈ 5 ఆహారాలను తీసుకోండి !

విటమిన్‌ సి లోపం సమస్య చాలా మందికి వస్తుంటుంది. అలాంటి వారిలో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇక కరోనా సమయం కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. విటమిన్‌ సి శరీరానికి సరిగ్గా అందేలా చూసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇక విటమిన్‌ సి మనకు ఎందులో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

if you have vitamin c deficiency take these foods to increase immunity

1. నారింజ పండ్లలో విటమిన్‌ ఎ, బి, సి, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఫాస్ఫరస్, కోలిన్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషణను ఇవి అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నారింజ పండ్లను తినడం వల్ల సూర్య కిరణాల బారి నుంచి చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.

2. వేసవి కాలంలో మనకు ఎక్కడ చూసినా మామిడి పండ్లు కనిపిస్తాయి. వేసవిలో మామిడి పండ్లను కచ్చితంగా తినాలి. ఈ పండ్లలో విటమిన్‌ ఎ, సి, ఐరన్‌, కాపర్‌, పొటాషియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇతర వ్యాధులు రాకుండా చూస్తాయి. అందువల్ల ఈ పండ్లను రోజూ తినాలి.

3. ద్రాక్ష పండ్లలో విటమిన్ ఎ, బి, సి, పొటాషియం, కాల్షియంలు సమృద్ధిగా ఉంటాయి. ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల ద్రాక్షలను తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

4. నిమ్మకాయల్లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. అలాగే థయామిన్‌, నియాసిన్‌, రైబో ఫ్లేవిన్‌, విటమిన్‌ బి6, ఇ, ఫోలేట్‌ తదితర పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంటు వ్యాధులు రాకుండా చూస్తాయి. నిమ్మకాయను రసం రూపంలో తీసుకోవచ్చు. వీటిని సలాడ్స్‌ లో లేదా ఆహారంలోనూ తీసుకోవచ్చు.

5. టమాటాల్లో విటమిన్‌ సి, లైకోపీన్‌, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. టమాటాలను రోజూ సూప్‌ లేదా జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు.

ఇవే కాకుండా కివీలు, స్ట్రాబెర్రీ, బొప్పాయి, క్యాప్సికం, గ్రీన్‌ యాపిల్‌, వెల్లుల్లి, బెర్రీలు, పచ్చి బఠానీలను తీసుకోవడం వల్ల కూడా విటమిన్‌ సి లభిస్తుంది. దీని వల్ల విటమిన్‌ సి లోపం నుంచి బయట పడవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts