Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించేట‌ప్పుడు ఈ ఆహారాల‌ను తినండి.. లివ‌ర్‌పై ఎఫెక్ట్ ప‌డ‌కుండా అడ్డుకోవ‌చ్చు..

Admin by Admin
June 25, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆల్కహాల్ తాగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఆఫీస్ పార్టీలు, ఇంట్లోని వేడుకల్లో ఇప్పుడు ఆల్కహాల్ డ్రింకులు కనిపిస్తున్నాయి. వారాంతం కోసం ఎంతోమంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే. అయితే మద్యం తాగడం వల్ల శరీరం పై ఎన్నో ప్రతికూల ప్రభావాలు పడతాయి. దీన్ని మితంగా తాగితేనే మంచిది. అధికంగా సేవిస్తే మాత్రం కొన్ని రోజుల్లోనే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఆల్కహాల్ తాగేటప్పుడు కొన్ని రకాల ఆహారాలను జతగా తినడం వల్ల శరీరం ఆల్కహాల్ శోషించుకోవడానికి నెమ్మదించేలా చేయొచ్చు. అలాగే రక్త ప్రవాహంలోకి ఆల్కహాల్ చేరడానికి నెమ్మదింప జేయచ్చు. హ్యాంగోవర్, మత్తు వంటివి ఈ ఆహారాలు అడ్డుకుంటాయి. దీన్ని బట్టి ఆల్కహాల్‌తో పాటు లేదా ఆల్కహాల్ తాగిన వెంటనే తినాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకోండి.

తృణధాన్యాలు అంటే హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ రైస్, క్వినోవా, వోట్స్ వంటి వాటితో చేసిన స్నాక్స్ ను మద్యంతో పాటు జతగా పెట్టుకోండి. ఇవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. కాబట్టి రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ ఒకేసారి విడుదల కాకుండా అడ్డుకుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆల్కహాల్ తాగిన తర్వాత మైకం, అలసట, మానసిక కల్లోలం వస్తాయి. వాటిని తట్టుకునే శక్తి ఈ తృణధాన్యాలు ఇస్తాయి. తృణధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆల్కహాల్ శోషణను కూడా నెమ్మదించేలా చేస్తుంది. లీన్ ప్రోటీన్లు చికెన్, చేపలు, బీన్స్, చిక్కుళ్ళు వంటి వాటిలో ఉంటాయి. ఈ లీన్ ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తినడం వల్ల మద్యం శోషణ శరీరంలో మందగిస్తుంది. ప్రోటీన్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఆల్కహాల్ మీ రక్త ప్రవాహంలోకి ఒకసారి చేరే అవకాశం ఉండదు. ఇది రక్తంలో ఆల్కహాల్ గాఢతను నిరోధించడంలో సహాయపడుతుంది. మత్తు రాకుండా అడ్డుకుంటుంది.

take these foods when drinking alcohol to prevent effect on liver

మద్యపానం చేసిన తర్వాత ఒక అవకాడో పండును తింటే మంచిది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కొవ్వులు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇది ఆల్కహాల్ శోషించుకునే రేటును శరీరంలో తగ్గిస్తుంది. మద్యపానం వల్ల మెదడు ఆలోచన తీరు క్షీణిస్తుంది. అలా జరగకుండా అవకాడో అడ్డుకుంటుంది. ఆల్కహాల్ తాగిన వెంటనే స్ట్రాబెర్రీలు, నారింజ, ద్రాక్ష పండ్లు పంటివి తినాలి. లేదా పాలకూర, కాలే వంటి ఆకుకూరలతో చేసిన ఆహారాలను తినాలి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో చేరుతాయి. ఆల్కహాల్ వల్ల శరీరంలో కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆల్కహాల్ వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది. దీంతో శరీరంలో ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. వాటిని తిరిగి నింపడంలో ఈ ఆహారం ముందుంటుంది.

బాదం, జీడిపప్పులు, వాల్నట్స్, చియా సీడ్స్ వంటివన్నీ కూడా మద్యంతో పాటు జతగా తింటే ఎంతో మంచిది. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఆల్కహాల్ శోషణను మందగించేలా చేస్తాయి. మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇవి కండరాల తిమ్మిరిని నివారించి నిద్ర పట్టేలా చేస్తాయి. గుడ్లు అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. సిస్టీన్ వంటి అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ తాగేటప్పుడు కోడిగుడ్లను తినడం వల్ల ఆల్కహాల్ వల్ల విడుదలయ్యే విషపూరితమైన ఎసిటాల్డిహైడ్‌ను విచ్ఛిన్నం చేయడంలో కోడిగుడ్డులోని అమైనో ఆమ్లాలు సహాయపడతాయి. అలాగే కాలేయాన్ని కాపాడతాయి. హాంగోవర్ల తీవ్రతను తగ్గిస్తాయి.

Tags: alcoholliver
Previous Post

మీ కూతురికి నేర్పించాల్సిన 16 నైపుణ్యాలు..!

Next Post

రాత్రిపూట అస‌లు నిద్ర ప‌ట్ట‌డం లేదా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Related Posts

vastu

పడక గది ఏ మూలన ఉంటే మీకు మంచి జరుగుతుందో తెలుసా?

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధా విగ్రహం ఎలా ఉంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

July 13, 2025
వైద్య విజ్ఞానం

ఉమ్మిని మింగ‌డం మంచిదా..? లేదా ప‌దే ప‌దే ఊసేయాలా..?

July 13, 2025
చిట్కాలు

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025
హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా..? అయితే ఈ ఆహారాల‌ను రోజూ తినండి..!

July 13, 2025
హెల్త్ టిప్స్

ఈ కూర‌గాయ‌ల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.