ఒకప్పుడు డయాబెటీస్ రోగులకు పండ్లు అసలు తినరాదని చెప్పేవారు. వాస్తవం తెలపాలంటే, డయాబెటీస్ రోగులకు కొన్ని పండ్లు మంచివే. వీరు తినే పండ్లలో అధిక గ్లూకోజు, కొవ్వు మాత్రం వుండరాదు. అవకాడో లేదా బటర్ ఫ్రూట్ – ఇది చెడు కొల్లెస్టరాల్ మరియు ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిలను తగ్గిస్తుంది. దీనిలో వున్న పొటాషియం కూడా డయాబెటీస్ వైద్యానికి సహకరిస్తుంది. అవకాడో లోని మంచి కొవ్వు ఇన్సులిన్ స్ధాయిని పెంచి బ్లడ్ లో షుగర్ స్ధాయిని తగ్గిస్తుంది.
ఆపిల్స్ – ఆపిల్ తిన్న ఇరవై నాల్గు గంటలలో దాని ప్రభావం చూపుతుంది. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఆహారం. డయాబెటీస్ లక్షణమైన కొన్ని నొప్పులు, మంట దీనితో నయం చేయవచ్చు. ద్రాక్షపండ్లు – ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువ. సిట్రస్ జాతి పండు. జీర్ణక్రియను మెరుగుపరచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. వీటిలోని విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గ్లూకోజ్ లెవెల్ ను తగ్గించి ఖచ్చితమైన బ్లడ్ షుగర్ లెవెల్ ను ఇస్తాయి.
డయాబెటీస్ రోగాన్ని నియంత్రించాలంటే ఇది దివ్యమైన పండు. ఈ పండ్లు ప్రతిరోజూ తింటే డయాబెటీస్ దూరమే మరి. డయాబెటీస్ రోగులు తగుమాత్రంగా ఇంకా తినగలిగినవి నారింజ, చేదు పుచ్చ, అరటిపండు మొదలైనవి కూడా తినవచ్చు.