మనలో అధిక శాతం మందికి వెన్ను నొప్పి అనేది సహజంగానే వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, రోజూ ప్రయాణాలు ఎక్కువగా చేయడం లేదా ఎక్కువ సేపు కూర్చుని ఉండడం, వయస్సు మీద పడడం, స్థూలకాయం.. వంటి అనేక కారణాల వల్ల వెన్ను నొప్పి వస్తుంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. కొబ్బరినూనెను కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా కర్పూరం వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. చల్లార్చి దాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఉపయోగించి వారంలో రెండు సార్లు వెన్నుపై మర్దనా చేయాలి. నిద్రకు ఉపక్రమించే ముందు ఇలా చేయాలి. దీంతో వెన్ను నొప్పి తగ్గుతుంది.
2. స్నానం చేసే గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్‌ను కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. దీని వల్ల వెన్ను నొప్పి నుంచి బయట పడవచ్చు. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
3. హాట్ వాటర్ బ్యాగ్‌తో తరచూ వెన్నుపై కాపడం పెడుతూ ఉండాలి. దీని వల్ల కూడా వెన్ను నొప్పి తగ్గుతుంది.
4. వెన్నుపై ఆవనూనెతో బాగా మర్దనా చేయాలి. గంట సేపు ఆగి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే చాలు, వెన్ను నొప్పి నుంచి బయట పడవచ్చు.
5. రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు, తేనెలను కలిపి తాగాలి. దీంతో అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. దగ్గు, జలుబు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
6. రోజూ ఆహారంలో అల్లం తీసుకోవడం వల్ల వెన్ను నొప్పి నుంచి బయట పడవచ్చు. రోజూ పరగడుపునే అల్లం రసం సేవించవచ్చు. లేదా అల్లం వేసి కాచిన నీటిని తాగవచ్చు. దీంతో కూడా నొప్పులను తగ్గించుకోవచ్చు.
7. మార్కెట్‌లో అనేక రకాల హెర్బల్ ఆయిల్స్ దొరుకుతాయి. వాటిల్లో ఏదైనా నూనెతో వెన్నును మర్దనా చేస్తుండాలి. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.
8. బియ్యాన్ని కొద్దిగా తీసుకుని పెనంపై వేసి వేయించాలి. దాన్ని వస్త్రంలో చుట్టి దాంతో కాపడం పెట్టాలి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365