Cancer : క్యాన్సర్ ను దూరం చేసే.. వంటింటి ఔషధం..

Cancer : ప్రస్తుత కాలంలో క్యాన్సర్ బారినపడి మరణించే వారి సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. వివిధ రకాల క్యాన్సర్ లతో బాధపడుతూ ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే క్యాన్సర్ రాకుండా ఉండటం కోసం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని పలువురు నిపుణులు చెబుతున్నారు.

take this natural medicine for to prevent cancer

క్యాన్సర్ సమస్యతో బాధపడేవారు లేదా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలని భావించే వారికి ఇదొక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. కేవలం మన వంటింట్లో దొరికే వివిధ రకాల వంట దినుసులతో ఔషధాన్ని తయారుచేసుకొని ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా తినడం వల్ల మన శరీరంలో పెరుగుతున్న క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

క్యాన్సర్ తో బాధపడే వారు ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, పావు టీ స్పూన్ నల్ల మిరియాలు, అర టీ స్పూను అల్లం, అర టీ స్పూను పసుపు.

ఈ పదార్థాలన్నింటినీ మిశ్రమంలా తయారు చేసుకుని ప్రతి రోజూ ఏదో ఒక పూట మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో పెరుగుతున్న క్యాన్సర్ కణాలను నశింపచేస్తాయి. అదేవిధంగా క్యాన్సర్ తో బాధపడేవారు ప్రతిరోజూ మూడు పూటలా తినడం వల్ల  ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Sailaja N

Recent Posts