Matcha Tea : ఆరోగ్యానికి మేలుచేసే మాచా టీ.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Matcha Tea : సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉదయం ఒక కప్పు కాఫీ, టీ లేనిదే రోజు గడవదు. ఇలా చాలా మంది కప్పు కాఫీ, టీ తోనే రోజును ప్రారంభిస్తారు. ఉదయం కాఫీ లేదా టీ తాగటం వల్ల ఆ రోజంతా ఎంతో చురుకుగా పని చేస్తారని భావిస్తుంటారు. పని ఒత్తిడిలో భాగంగా ఆ ఒత్తిడి నుంచి బయటపడటం కోసం కూడా చాలా మంది మధ్యలో టీ తాగుతూ ఉపశమనం పొందుతుంటారు.

Matcha Tea health benefits

అయితే ప్రస్తుతం మార్కెట్లో మనకి ఎన్నో రకాల టీ పొడులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఎంతో పేరుగాంచినదే మాచా టీ. ఈ టీ పొడిని చైనా, జపాన్ వంటి దేశాలలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం ఈ టీ మన దేశంలో కూడా అందుబాటులో ఉంది. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఈ టీ తీసుకోవడం వల్ల ఏ విధమైన ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఎంతో ప్రసిద్ధి గాంచిన మాచా టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇలా యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో లభించడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను బయటకు తొలగించడానికి దోహదపడతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.

* మూత్ర పిండాల పనితీరును ఈ టీ మెరుగు పరుస్తుంది. ప్రతి రోజూ రెండు కప్పుల టీ తాగడం వల్ల కాలేయ పనితీరు కూడా మెరుగుపడి జీర్ణక్రియ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

* ఈ టీ దాగి ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి దోహదపడతాయి. అలాగే శరీర బరువును తగ్గించడానికి ఈ మాచా టీ ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ టీని రోజూ తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

Share
Sailaja N

Recent Posts