Stress : అధిక ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే ఒత్తిడి మటుమాయం!

Stress : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఎక్కువ గంటలు పని చేయటం వల్ల వారిపై అధిక ఒత్తిడి పడుతోంది. అధిక ఒత్తిడి కారణంగా చాలామంది డిప్రెషన్ లోకి వెళుతూ చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

if you are facing Stress daily then do this for 15 minutes

అయితే ఈ విధమైన అధిక ఒత్తిడిని అధిగమిస్తే ఎంతో హాయిగా జీవితం గడపవచ్చుని మానసిక వైద్యులు తెలియజేస్తున్నారు. కేవలం ప్రతి రోజూ సాయంత్రం 15 నిమిషాల పాటు అలా బయటకు వాకింగ్ చేస్తూ వెళ్లడం వల్ల ఉదయం నుంచి మనపై కలిగిన ఒత్తిడి నుంచి మనం ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఒత్తిడి సమస్య నుంచి బయట పడటం కోసం ఇంట్లో ఉంటూ మందులు ఉపయోగించడం కన్నా అలా 15 నిమిషాలు బయట వాకింగ్ చేసి రావడం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా జాగింగ్ లేదా వాకింగ్ కి వెళ్ళినప్పుడు మన హృదయ స్పందన రేటును 50 శాతం వేగం పెంచడానికి ప్రయత్నిస్తే తప్పకుండా ఒత్తిడి సమస్య నుంచి బయటపడవచ్చని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ మానసిక వైద్యులు డాక్టర్ ఆగస్ తెలిపారు.

తన వద్దకు ఎవరైనా డిప్రెషన్ తో చికిత్స చేయించుకోవడానికి వస్తే వారికి తాను ఎలాంటి మందులు ఇవ్వనని కేవలం ప్రతి రోజూ పదిహేను నిమిషాలు ఆరుబయట వాకింగ్ చేయమని సలహా ఇస్తానని డాక్టర్ ఆగస్ తెలియజేశారు. కనుక మీరు కూడా రోజూ తీవ్రమైన  ఒత్తిడిని ఎదుర్కొంటుంటే సాయంత్రం 15 నిమిషాల పాటు అలా బయట వాకింగ్‌ చేసి రండి. ఒత్తిడి తగ్గిపోతుంది.

Sailaja N

Recent Posts