Apple Cider Vinegar : బ‌రువు త‌గ్గేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకుంటున్నారా ? ముందు ఇది చ‌ద‌వండి..!

Apple Cider Vinegar : అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ప్ర‌స్తుతం చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప‌లు ర‌కాల చిట్కాల‌ను కూడా పాటిస్తున్నారు. అయితే బరువును త‌గ్గించేందుకు ఉప‌యోగించే వాటిల్లో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ఒక‌టి. ఇది అధిక బ‌రువు త‌గ్గేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని యాపిల్ పండ్ల‌ను పులియబెట్టి త‌యారు చేస్తారు. క‌నుక ఆరోగ్య‌క‌ర‌మైంది. అయితే దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారా.. ఎలాంటి న‌ష్టాలు ఉంటాయి.. దీన్ని ఎలా తీసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

taking Apple Cider Vinegar for weight loss then you should read this
Apple Cider Vinegar

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ చాలా పుల్ల‌గా.. అధిక ఆమ్లత్వాన్ని క‌లిగి ఉంటుంది. క‌నుక దీన్ని నేరుగా తీసుకోరాదు. ఎట్టి ప‌రిస్థితిలోనూ నీటిలో క‌లిపి తాగాలి. అలాగే చాలా త‌క్కువ పరిమాణంలో దీన్ని తీసుకోవాలి. దంతాల‌కు త‌గ‌ల‌కుండా దీన్ని తీసుకోవాలి. లేదంటే దంతాల‌పై ఉండే ఎనామిల్ పొర దెబ్బ తింటుంది. ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి రాత్రి నిద్ర‌కు ముందు తాగాలి. అందులో తేనె కూడా ఒక టీస్పూన్ క‌ల‌పాలి.

ఇక యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. బీపీ అదుపులోకి వ‌స్తుంది. ఇలా ప‌లు ర‌కాల ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. అయితే యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ అంద‌రికీ ప‌డ‌దు. ఇది కొంద‌రిలో భిన్న ర‌కాల స‌మస్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. దీన్ని తీసుకుంటే కొంద‌రికి విప‌రీతంగా జుట్టు రాల‌డం, చెమ‌ట‌లు అధికంగా ప‌ట్ట‌డం, నీర‌సం, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకుంటే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్ల‌యితే వెంట‌నే దీన్ని తీసుకోవ‌డం ఆపేయాలి. ఇలా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో న‌ష్టం క‌ల‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. ఇక మిగిలిన ఎవ‌రైనా స‌రే నిర్భ‌యంగా దీన్ని తీసుకోవ‌చ్చు. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి.

Admin

Recent Posts