Rice : మిగిలిపోయిన అన్నాన్ని ఎక్కువ సేపు అలాగే ఉంచి తింటున్నారా.. అయితే అత్యంత ప్రమాదకరం.. ఎలాగంటే..?

Rice : ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది రోజూ తింటున్న ఆహారాల్లో అన్నం కూడా ఒకటి. దక్షిణ భారతీయులకు అన్నమే ప్రధాన ఆహారం. ఈ క్రమంలోనే బియ్యంలోనూ ఎన్నో వెరైటీలు ఉంటాయి. స్థోమత ఉన్నవారు సన్న బియ్యం కొని వండి తింటారు. లేదంటే రేషన్‌ బియ్యం తింటారు. అయితే ఏ బియ్యం అయినా సరే వండితే అన్నం అవుతుంది. కానీ ఇలా అన్నం వండిన వెంటనే తినేయాలి. దాన్ని ఎక్కువ సేపు ఉంచిన తరువాత తినరాదు. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బియ్యంలో సహజంగానే బేసిలస్‌ సిరియస్‌ అనే ఒక రకానికి చెందిన స్పోర్స్‌ ఉంటాయి. ఇవి ఒక రకమైన సూక్ష్మ క్రిములు. అయితే బియ్యం వండిన తరువాత కూడా అన్నంలో ఇవి కొంత పరిమాణంలో అలాగే ఉంటాయి. కానీ స్వల్ప పరిమాణంలో ఉంటాయి కనుక మనం అన్నం తిన్నా ఏమీ కాదు. అయితే ఎప్పుడైతే మనం మిగిలిపోయిన అన్నాన్ని ఎక్కువ సేపు అలాగే ఉంచుతామో.. అప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఈ స్పోర్స్‌ అన్నంలో వృద్ధి చెందుతాయి. దీంతో కొంత సమయం గడిచాక అన్నంలో వీటి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో అలా సూక్ష్మక్రిములతో నిండిన అన్నాన్ని మనం తింటే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

taking left over rice after some time is unhealthy
Rice

అన్నాన్ని ఎక్కువ సేపు ఉంచిన తరువాత తింటే మనం అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా కడుపులో నొప్పి, పేగులు పట్టేయడం, నీళ్ల విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. ఇవి వస్తే ఫుడ్‌ పాయిజన్‌ అయిందని గుర్తించాలి. వెంటనే వైద్య సహాయం పొందాలి. అయితే అన్నాన్ని వండిన తరువాత కాస్త ఆలస్యంగా తినాలనుకునే వారు దాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. దీంతో అందులో బాక్టీరియా వృద్ధి చెందదు. తరువాత ఆ అన్నాన్ని వేడి చేసుకుని కూడా తినవచ్చు. కానీ వండిన అన్నాన్ని మాత్రం గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు అలాగే ఉంచరాదని.. వెంటనే తినేయాలని.. ఆలస్యం అవ్వాల్సి వస్తే.. దాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్న వారవుతారని అంటున్నారు.

Share
Editor

Recent Posts