Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Rice : మిగిలిపోయిన అన్నాన్ని ఎక్కువ సేపు అలాగే ఉంచి తింటున్నారా.. అయితే అత్యంత ప్రమాదకరం.. ఎలాగంటే..?

Editor by Editor
April 25, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Rice : ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది రోజూ తింటున్న ఆహారాల్లో అన్నం కూడా ఒకటి. దక్షిణ భారతీయులకు అన్నమే ప్రధాన ఆహారం. ఈ క్రమంలోనే బియ్యంలోనూ ఎన్నో వెరైటీలు ఉంటాయి. స్థోమత ఉన్నవారు సన్న బియ్యం కొని వండి తింటారు. లేదంటే రేషన్‌ బియ్యం తింటారు. అయితే ఏ బియ్యం అయినా సరే వండితే అన్నం అవుతుంది. కానీ ఇలా అన్నం వండిన వెంటనే తినేయాలి. దాన్ని ఎక్కువ సేపు ఉంచిన తరువాత తినరాదు. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బియ్యంలో సహజంగానే బేసిలస్‌ సిరియస్‌ అనే ఒక రకానికి చెందిన స్పోర్స్‌ ఉంటాయి. ఇవి ఒక రకమైన సూక్ష్మ క్రిములు. అయితే బియ్యం వండిన తరువాత కూడా అన్నంలో ఇవి కొంత పరిమాణంలో అలాగే ఉంటాయి. కానీ స్వల్ప పరిమాణంలో ఉంటాయి కనుక మనం అన్నం తిన్నా ఏమీ కాదు. అయితే ఎప్పుడైతే మనం మిగిలిపోయిన అన్నాన్ని ఎక్కువ సేపు అలాగే ఉంచుతామో.. అప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఈ స్పోర్స్‌ అన్నంలో వృద్ధి చెందుతాయి. దీంతో కొంత సమయం గడిచాక అన్నంలో వీటి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో అలా సూక్ష్మక్రిములతో నిండిన అన్నాన్ని మనం తింటే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

taking left over rice after some time is unhealthy
Rice

అన్నాన్ని ఎక్కువ సేపు ఉంచిన తరువాత తింటే మనం అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా కడుపులో నొప్పి, పేగులు పట్టేయడం, నీళ్ల విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. ఇవి వస్తే ఫుడ్‌ పాయిజన్‌ అయిందని గుర్తించాలి. వెంటనే వైద్య సహాయం పొందాలి. అయితే అన్నాన్ని వండిన తరువాత కాస్త ఆలస్యంగా తినాలనుకునే వారు దాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. దీంతో అందులో బాక్టీరియా వృద్ధి చెందదు. తరువాత ఆ అన్నాన్ని వేడి చేసుకుని కూడా తినవచ్చు. కానీ వండిన అన్నాన్ని మాత్రం గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు అలాగే ఉంచరాదని.. వెంటనే తినేయాలని.. ఆలస్యం అవ్వాల్సి వస్తే.. దాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్న వారవుతారని అంటున్నారు.

Tags: rice
Previous Post

Sugar Palm Fruit Milkshake : తాటి ముంజలతో మిల్క్‌ షేక్‌.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. శరీరం చల్లగా మారుతుంది..!

Next Post

Mango Milkshake : ఎండల్లో చల్ల చల్లని మ్యాంగో మిల్క్ షేక్‌.. తయారీ ఇలా..!

Related Posts

international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025
హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.