టమాటా కెచప్‌ను సహజంగానే పలు ఆహారాలపై వేసుకుని తింటుంటారు. ముఖ్యంగా బేకరీ ఆహారాలతోపాటు ఫాస్ట్ ఫుడ్‌పై కెచప్‌ను వేసి తింటారు. అయితే కెచప్ ను ఎక్కువగా తినడం వల్ల మన శరీరానికి హాని కలుగుతుంది. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. టమాటా కెచప్‌ను అధికంగా తింటే బరువు అధికంగా పెరిగి స్థూలకాయం సమస్య వస్తుంది. ఎందుకంటే కెచప్‌లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. క్యాలరీలు కూడా ఎక్కువే. అందువల్ల కెచప్‌ను అధికంగా తింటే బరువు పెరుగుతారు.
2. అధికంగా టమాటా కెచప్‌ను తినడం వల్ల అసిడిటీ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణాశయంలో అసౌకర్యం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల కెచప్ వాడకాన్ని తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి.
3. కెచప్‌ను అధికంగా తింటే కొందరికి అలర్జీలు వస్తాయి. కెచప్‌లో హిస్టామైన్ అధిక మొత్తంలో ఉంటుంది. అది అలర్జీలను కలగజేస్తుంది. అవి ఒక పట్టాన తగ్గవు. కనుక కెచప్‌ను వాడకపోవడమే ఉత్తమం.