Less Sperm Count : పురుషుల్లో వీర్య కణాలు త‌గ్గేందుకు గ‌ల కార‌ణాలు ఇవే..!

Less Sperm Count : నేటి త‌రుణంలో వ‌య‌సులో ఉన్న పురుషుల్లో కూడా వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటుంది. పురుషుల్లో వీర్య క‌ణాలు 50 నుండి 60 మిలియ‌న్ల సంఖ్య‌లో ఉండాలి. కానీ చాలా మంది పురుషుల్లో 5 నుండి 20 మిలియ‌న్ల సంఖ్య‌లో మాత్ర‌మే వీర్య క‌ణాలు ఉంటున్నాయి. దీంతో పురుషులు కూడా సంతానలేమితో బాధ‌ప‌డుతున్నారు. పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌గ్గ‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి. ఈ కార‌ణాల‌ను ముందుగానే తెలుసుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఇటువంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. అలాగే ఈ కార‌ణాల‌ను తెలుసుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య నుండి చాలాసుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

పురుషుల్లో వీర్య క‌ణాలు త‌గ్గ‌డానికి గ‌ల కార‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగ త్రాగ‌టం, ఆల్క‌హాల్ తీసుకోవ‌డం వల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌గ్గుతుంది. అలాగే చాలా మంది పురుషులు ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిఫ్రెష‌న్ వంటి వాటి వ‌ల్ల కూడా వీర్య క‌ణాల సంఖ్య త‌గ్గుతుంది. అలాగే పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ త‌క్కువ‌గా ఉండడం చేత వీర్య‌క‌ణాలు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. అదే విధంగా పురుషుల్లో వీర్య క‌ణాల‌ను ఉత్ప‌త్తి చేసే ట్యూబ్స్ చెడిపోవ‌డం వ‌ల్ల వీర్య క‌ణాలు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. అలాగే హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా కూడా పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే అధిక బ‌రువు, డ‌యాబెటిస్ వంటి కార‌ణాల చేత కూడా పురుషుల్లో వీర్య‌క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటుంది.

these are the reasons for Less Sperm Count
Less Sperm Count

రేడియేష‌న్ కార‌ణంగా, ర‌సాయనాలు క‌లిగిన మందుల కార‌ణంగా పురుషుల్లో వీర్య‌క‌ణాల‌ను ఉత్ప‌త్తి చేసే క‌ణాలు దెబ్బ‌తింటాయి. దీంతో వారిలో వీర్యక‌ణాలు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. అలాగే చాలా మంది పురుషుల్లో ఒడిలో లాప్ టాప్ ను పెట్టుకుని ప‌ని చేస్తూ ఉంటారు. అలాగే కొంద‌రు పురుషులు బిగుతైన లోదుస్తుల‌ను, జీన్స్ వంటి వాటిని ధ‌రిస్తూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా వీర్య క‌ణాలు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. ఇలాంటి కార‌ణాల చేత పురుషుల్లో వీర్య క‌ణాలు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. వీర్యక‌ణాలు త‌క్కువ‌గా ఉన్న పురుషులు ముందుగా వారి జీవ‌న విధానాన్ని మార్చుకోవాలి. అలాగే మొల‌కెత్తిన గింజ‌లు, నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్యక‌ణాల నాణ్య‌త‌తో పాటు వారి సంఖ్య కూడా పెరుగుతుంది. భ‌విష్య‌త్తులో మ‌ర‌లా ఇటువంటి స‌మ‌స్య రాకుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts