హెల్త్ టిప్స్

Food Combinations : ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌లిపి తీసుకోరాదు.. ఏం జ‌రుగుతుందంటే..?

Food Combinations : ముద్దపప్పులో పప్పుచారు కలుపుకొని తింటే ఉంటుంది చూడండి ఆ మజానే వేరు. అలాగే పచ్చి పులుసులో బంగాళాదుంప ప్రై, గట్టిపప్పులో ఆవకాయ్ ఇలా.. రకరకాల కాంబినేషన్స్ రుచికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. వంటింట్లో ఉన్న అమ్మను.. అమ్మా ఈ రోజు దోసకాయ్ పప్పు వండవే.. అంటూ టీవీ రూమ్ లో కూర్చొని చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఆ కాంబినేషన్ కు ఉన్న టేస్ట్ అది. కానీ కొన్ని కాంబినేషన్లు మనకు హానిని కూడా కలిగిస్తాయి. అటువంటి కాంబినేషన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటల్లో సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. స్టార్చీ కార్బొహైడ్రేట్స్‌ చిలగ‌డ దుంపల్లో ఉంటాయి. కార్బొహైడ్రేట్స్‌తో సిట్రిక్ యాసిడ్ కలిపి తింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది. భోజనం తర్వాత అలసటగా అనిపిస్తుంది. క‌నుక ట‌మాటాలు, చిల‌గ‌డ దుంప‌ల‌ను క‌లిపి తిన‌రాదు. అలాగే పండ్లు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. వీటిని భోజనంతో కలిసి తీసుకోవడం వల్ల భోజనంలో ఉండే పోష‌కాలు త్వరగా జీర్ణం కావు. కాబట్టి వాటితోపాటు పండ్లు కూడా జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది. సో.. ఆలోపే పండ్లు కుళ్లిపోతాయ్. దాని కారణంగా పేగులోని లోపలి పొర దెబ్బతింటుంది. క‌నుక భోజ‌నాన్ని, పండ్ల‌ను క‌ల‌ప‌రాదు. కాస్త గ్యాప్ ఇచ్చి తినాలి.

these food combinations are not good for health know why

మాంసం ఉత్పత్తుల్లోని మాంసకృత్తులు పిండి పదార్థాలతో కలిస్తే వాటిలోని మాక్రో న్యూట్రియెంట్స్‌ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తయ్యే జీర్ణరసాలు కలిసిపోవడం వల్ల కడుపులో గ్యాస్‌ పుడుతుంది. దాంతో కడుపు ఉబ్బరిస్తుంది. క‌నుక మాంసంతో పిండి ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోరాదు. అలాగే పాల ఉత్పత్తులు సైనస్ లను మూసేస్తాయి. జలుబు, ఇతర అలర్జీలను పెంచుతాయి. ఈ ఉత్పత్తులను పళ్లతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపవుతాయి. కాబట్టి పెరుగును, పళ్లను విడివిడిగా తినాలి. రెండింటినీ క‌లిపి తిన‌రాదు. ఇలా ఈ ఫుడ్ కాంబినేష‌న్స్‌కు దూరంగా ఉంటే.. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts