Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా..?

Admin by Admin
December 15, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. అధిక శాతం వ్యాప్తి చెందుతున్న అనారోగ్యాల్లో ఎక్కువగా పరిశుభ్రత లేమి వల్ల వస్తున్నవే ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు కూడా చెబుతున్నారు. అయితే వీటిలో ప్రధానంగా చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం వల్లే ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయట. ఈ క్రమంలో మనం నిత్యం ఎక్కువగా వాడే చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రోజూ మనం ఆయా సందర్భాల్లో చేతులను ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి, వాటికి క్రిములు ఎక్కువగా అంటుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ క్రిములు ఎలాంటి ప్రదేశాల్లో అధికంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక్క విషయం, ఇప్పుడు చెప్పబోయే ఆయా ప్రదేశాల్లో మాత్రం టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములు ఉంటాయట.

టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములు ఉండే ప్రదేశాల్లో కంప్యూటర్ కీబోర్డు కూడా ఒకటి. నేడు అధిక శాతం మంది కంప్యూటర్ల పైనే పనిచేస్తున్న నేపథ్యంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత కచ్చితంగా ఉంది. లేదంటే అనేక రకాల వ్యాధులకు, ఇన్‌ఫెక్షన్లకు లోనయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైంది డబ్బు. ప్రధానంగా కరెన్సీ నోట్ల విషయానికి వస్తే ప్రతి నోటుపై కొన్ని కోట్లాది క్రిములు ఉంటాయి. ఈ క్రమంలో డబ్బులను ముట్టుకున్నా, లెక్కించినా కచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాల్సిందే. ఆఫీసుల్లో వాడే కప్పులకు కూడా బ్యాక్టీరియా అంటుకుని ఉంటుంది. కాబట్టి వాటిని వాడే ముందు జాగ్రత్తగా కడిగి వాడాలి. లేదంటే అనారోగ్యాలకు గురి కావల్సి వస్తుంది.

these places have more germs than toilet seat

నేడు మనకు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ సోడా హబ్‌లు దర్శనమిస్తున్నాయి. అయితే వాటిని ఆపరేట్ చేసే క్రమంలో అనేక రకాల బ్యాక్టీరియాలు సోడా హబ్ బటన్లకు అంటుకుంటున్నాయి. ప్రధానంగా మలం ద్వారా వ్యాపించే క్రిములు వాటికీ వ్యాపిస్తున్నాయట. ఈ క్రమంలో సోడా హబ్‌కు వెళ్లి సోడాను తాగేముందు ఒకసారి ఆలోచించండి. లేదంటే ఇవి సమస్యలను తెచ్చి పెడతాయి. స్విమ్మింగ్ పూల్స్‌లోనూ కోట్లాది క్రిములు ఉంటాయి. బాగా శుభ్రం చేసిన నీరు ఉంటేనే అందులోకి వెళ్లమని వైద్యులు సూచిస్తున్నారు. మనం ఏదైనా తినే క్రమంలో ఒక్కోసారి ఆహారం కింద పడుతుంటుంది. ఈ క్రమంలో అధిక శాతం మంది కింద పడ్డ ఆహారాన్ని కూడా తింటుంటారు. అయితే ఇలా తినడం చాలా అనారోగ్యకరమట. ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయట.

క్రెడిట్, డెబిట్ కార్డులను స్వైప్ చేసేందుకు ఉపయోగించే కార్డ్ రీడర్‌లకు కూడా ఎక్కువగా బ్యాక్టీరియా అంటుకుని ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటిని వాడితే కచ్చితంగా చేతులను కడుక్కోవాలి. నేటి తరుణంలో మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. అయితే వీటికి కూడా సూక్ష్మ క్రిములు వ్యాపిస్తున్నాయి. ప్రధానంగా డివైస్ స్క్రీన్‌పై ఎక్కువగా క్రిములు ఉంటాయి. కాబట్టి మొబైల్స్‌ను వాడినప్పుడు కూడా శుభ్రత పాటించాల్సిందే. నిత్యం కొన్ని వందల మంది అభిమానులు తమ సినీ తారల సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తారు. అయితే వీటిలోనూ సూక్ష్మ క్రిములు అధికంగానే ఉంటాయట. అధిక శాతం మంది ప్రజలు వాడే యంత్రాల్లో ఏటీఎం మిషన్లు కూడా ఉన్నాయి. వీటి వద్ద కూడా పరిశుభ్రంగా ఉండాలి. లేదంటే క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఎంత పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువునైనా సులభంగా నియంత్రించే రిమోట్ కంట్రోల్‌పై కూడా క్రిములు పేరుకుని ఉంటాయి. కాబట్టి దీని విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే. పెంపుడు కుక్కలు, పిల్లలు అభిమానంతో నాకితే వెంటనే స్నానం చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే వాటి నాలుక ద్వారా కొన్ని లక్షల సూక్ష్మ జీవులు మనపైకి వ్యాపిస్తాయట. బ్రాలు ధరించే మహిళలు కూడా శుభ్రతను పాటించాల్సిందేనట. ఎందుకంటే వాటిని వేసుకుంటే చెమట అధికంగా పడుతుందట. ఈ క్రమంలో సూక్ష్మ జీవులు శరీరంపై పేరుకుపోతాయి. కాబట్టి వాటిని తీసేసిన వెంటనే శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతోపాటు వాటిని కూడా తప్పనిసరిగా వాష్ చేయాలి.

టాయిలెట్ల లోపల లేదా వాటి పక్కనే టూత్‌బ్రష్‌లను స్టాండ్‌లలో ఉంచుతున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే టాయిలెట్లలో ఉండే క్రిములు టూత్‌బ్రష్‌లపైకి కూడా వ్యాపిస్తాయట. దీంతో ప్రమాదకరమైన అనారోగ్యాలు కలుగుతాయట. కాబట్టి మీ టూత్‌బ్రష్‌లను టాయిలెట్లకు దూరంగా ఉంచండి. ఎస్కలేటర్లపై రెండు వైపులా చేతులతో పట్టుకునేందుకు ఉపయోగపడే రెయిలింగ్‌లపై కూడా బ్యాక్టీరియాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఈ క్రమంలో వాటిని పట్టుకున్నాక ఏమీ తినకండి! చేతులు శుభ్రంగా కడిగాకే ఏదైనా తినండి. పెట్రోల్ పంపుల్లో ఇంధనం నింపేందుకు వాడే హ్యాండిల్‌పై క్రిములు అధిక సంఖ్యలో ఉంటాయి. వీటిపై కూడా ఓ లుక్కేయండి. చిన్నారులు ఎక్కువగా ఆడుకునే ప్లే గ్రౌండ్స్‌తోపాటు ఆట మైదానాల్లోనూ సూక్ష్మ క్రిములు ఎక్కువగానే ఉంటాయి. ప్రధానంగా పిల్లలు ఈ తరహా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి సంరక్షణపై కూడా దృష్టి పెట్టండి.

Tags: keyboardtoilet seat
Previous Post

Gold Jewellery : క‌ల‌లో బంగారం, న‌గ‌లు క‌నిపిస్తున్నాయా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా..?

Next Post

Neem Fruits : ప‌ర‌గ‌డుపున‌ రెండు పండ్లను తింటే.. ఏం అవుతుందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..!

Related Posts

Off Beat

విమానం రెక్క‌లు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?

July 20, 2025
ఆధ్యాత్మికం

మొలతాడు ఎందుకు కడతారో తెలుసా..?దీని వెనుక సైన్స్ ఏంటి అంటే.??

July 20, 2025
mythology

పుష్ప‌క విమానం ఎవ‌రిదో తెలుసా??

July 20, 2025
హెల్త్ టిప్స్

మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
lifestyle

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.