Tulsi Leaves For Heart : నేటి ఆధునిక తరుణంలో మనలో చాలా మంది రక్తనాళాలు పూడుకుపోవడం, గుండె పోటు వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా గుండె పోటు బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. గుండె పోటు బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారమే గుండె పోటు రావడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం, కొవ్వులు కలిగిన ఆహారాలను తినడం, నూనెలో వేయించిన పదార్థాలను తినడం వల్ల శరీరంలో అలాగే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తనాళాల్లో రక్తసరఫరాకు ఆటంకం కలిగి గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతున్నాయి.
అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యల కారణంగా కూడా గుండెపోటు వస్తుంది. అదే విధంగా మారిన మన జీవన విధానం వల్ల కూడా మనం గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు వంటి కారణాల వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి మనం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడంతో పాటు గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటాము.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో మనకు వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వెల్లుల్లి రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో ఉదయం పరగడుపున అలాగే సాయంత్రం పూట మరోసారి తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా వెల్లుల్లి రసాన్ని తీసుకోవడంతో పాటు ఉదయం, సాయంత్రం పండ్లను మాత్రమే తినాలి. మధ్యాహ్నం ఒక పూట మాత్రమే అన్నం తినాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తులసి ఆకుల రసం కూడా మనకు ఎంతో దోహదపడుతుంది. ఒక టీ స్పూన్ తులసి ఆకుల రసాన్ని అర గ్లాస్ నీటిలో కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ చిట్కాలను పాటిస్తూనే చక్కటి జీవన విధానాన్ని, ఆహార నియమాలను పాటించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఒత్తిడి, ఆందోళన వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల గుండె పోటు వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోకుండా ఉంటుంది.