Weight Loss : నిమ్మకాయల వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మకాయలో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను అందిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. అయితే అధిక బరువు తగ్గించడంలో నిమ్మకాయ మనకు బాగా ఉపయోగపడుతుంది. అందుకు ఏం చేయాలంటే..
ఒక నిమ్మకాయను కోసి అందులో సగం ముక్కను తీసుకోవాలి. ఇప్పుడు ఒక 100 ఎంఎల్ మోతాదులో నీటిని ఒక పాత్రలో తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు వేడి చేయాలి. అనంతరం ఆ నీటిలో ముందుగా తీసుకున్న నిమ్మకాయ ముక్కను పిండాలి. తరువాత ఆ నీటిని పరగడుపునే తాగేయాలి. అనంతరం 30 నిమిషాల తరువాతే బ్రేక్‌ఫాస్ట్ చేయాలి.
ఇలా రోజూ ఉదయం పరగడుపునే నిమ్మకాయ రసాన్ని గోరు వెచ్చని నీటితో తాగుతుంటే శరీర జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. అంతేకాదు, మెటబాలిజం వేగవంతమై క్యాలరీలు ఫాస్ట్‌గా ఖర్చవుతాయి. దీంతో అధికంగా ఉన్న కొవ్వు ఇట్టే కరిగి బరువు తగ్గిపోతారు.
అధిక బరువుతోపాటు పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలోనూ నిమ్మకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల పైన తెలిపినట్లుగా చేస్తే బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.
ఇక ఈ విధంగా తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి కూడా లభిస్తుంది. అలాగే వ్యాధులు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.