Dolo 650 : కరోనా కారణంగా గత 2 సంవత్సరాల కాలంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అనేక మందిని తమ కుటుంబాలకు కరోనా మహమ్మారి దూరం చేసింది. ఎంతో మంది అనేక విధాలుగా నష్టపోయారు. ఎన్నో కోట్ల మంది కరోనా బారిన పడి చనిపోయారు. అయితే కరోనా సోకిన వారిలో చాలా మందికి కామన్‌గా కొన్ని లక్షణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
కరోనా సోకిన వారికి ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ మొదటి, రెండో వేవ్‌లలో చాలా మంది శ్వాస ఆడక చనిపోయారు. అయితే కోవిడ్ మూడో వేవ్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ చాలా మందికి స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. 95 శాతంకు పైగా మంది ఇంట్లోనే చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు.
అయితే చాలా మంది తమకు ఉన్న లక్షణాలను బట్టి సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ శాతం మంది డోలో 650 అనే ట్యాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. చాలా మంది ఎలాంటి డాక్టర్ సూచన లేకుండానే ఈ ట్యాబ్లెట్లను వేసుకుంటున్నారు.
మన ఇంట్లో ఎవరికైనా జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది డోలో 650. కోవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో చాలా మందికి దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు కామన్ లక్షణాలుగా ఉంటున్నాయి. దీంతో చాలా మంది ఈ లక్షణాలకు తగినట్లుగా తమకు తెలిసిన మందులను కొని తెచ్చి వాడుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నా సరే డాక్టర్ల సూచన మేరకే మందులను వాడాలని, సొంత జ్ఞానంతో మందులను వేసుకోకూడదని, అది ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే డోలోను అధికంగా వాడడం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.
డోలో 650 ట్యాబ్లెట్లను అధికంగా వాడితే పలు సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయి. అవి.. వికారం, లో బీపీ, తల తిరగడం, నీరసంగా అనిపించడం, నిద్రమత్తుగా ఉండడం, శరీరం అసౌకర్యంగా అనిపించడం, మలబద్దకం, స్పృహ తప్పిపడిపోతున్నట్లు అనిపించడం, నోట్లో పొడిదనం ఉండడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు.. వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటున్నారు.
ఇక డోలో 650 ట్యాబ్లెట్ల డోస్ మించితే ఇంకా ఎక్కువ దుష్పరిణామాలు వస్తాయని చెబుతున్నారు. అవి.. గుండె మరీ తక్కువగా కొట్టుకోవడం, గొంతు వద్ద వాపులు రావడం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడడం, గుండె వేగంగా కొట్టుకోవడం.. వంటి ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.
చాలా మంది జ్వరంతోపాటు తలనొప్పి, దంతాల నొప్పి, వెన్ను నొప్పి, నరాల నొప్పి, కండరాల నొప్పి వంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే డోలో 650 ట్యాబ్లెట్లను వాడుతున్నారు. వాస్తవానికి ఏ సమస్య ఉన్నా సరే డాక్టర్ల సూచన మేరకే మందులను వాడాలి. కానీ కొందరు పైన తెలిపిన ప్రతి దానికి డోలో ట్యాబ్లెట్లనే వేసుకుంటున్నారు. దీంతో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కనుక ఎవరైనా సరే డాక్టర్ సూచన మేరకే ఏ ట్యాబ్లెట్‌ను అయినా సరే వేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.