Vitamin D Deficiency : చాలామంది, ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్స్ అవసరం. విటమిన్స్ కనుక లోపించినట్లయితే, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇబ్బందులు కూడా తప్పవు. ఏ విటమిన్ లోపించినా కూడా, శరీరం పై ప్రభావం పడుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే చాలా రకాల సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వలన ఎముకలు, కండరాలు బలహీనమై పోవడం, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి. విటమిన్ డి లోపం వలన కలిగే లక్షణాలు గురించి ఇప్పుడే చూసేద్దాం.
విటమిన్ డి లోపం వలన ఎముకల నొప్పి ఉంటుంది. దీని కారణంగా, ఎముకలు బలహీనంగా మారిపోతాయి. క్యాల్షియం తగ్గడం వలన కీళ్లలో నొప్పి మొదలవుతుంది. అలానే, విటమిన్ డి లోపం వలన, రోగ నిరోధక వ్యవస్థ పై లోతైన ప్రభావం పడుతుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే జలుబు, జ్వరం రావడం, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి.
విటమిన్ డి లోపం ఉన్నట్లయితే జుట్టు రాలడం వంటివి కూడా చూడచ్చు. జుట్టు రాలిపోతున్నట్లయితే విటమిన్ డి లోపం అని మీరు గుర్తించాలి. విటమిన్ డి లోపం వలన చర్మ వ్యాధులు కూడా వస్తాయి. చర్మంపై దురద, మంట, చర్మం పొడిబారి పోవడం వంటి సమస్యలు కలుగుతాయి. కొన్ని సార్లు చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి. విటమిన్ డి లోపం ని గుర్తించి దాని నుండి బయటపడడం ముఖ్యం. గుడ్లు, చేపలు, పాలు, చీజ్ వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే విటమిన్ డి లోపం నుండి బయట పడొచ్చు.