Walking For Weight Loss : నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు వ్లల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తున్న కారణంగా చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అధిక బరువు నుండి బయటపడడం చాలా కష్టమైన పని చెప్పవచ్చు. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో వాకింగ్ కూడా ఒకటి. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారని చెప్పడం మనం వినే ఉంటాము. అయితే వాకింగ్ చేయడం వల్ల కొందరు బరువు తగ్గుతారు. మరికొందరు బరువు తగ్గరు. చాలా మంది నేను వాకింగ్ చేస్తున్నాను అయిన బరువు తగ్గడం లేదని చింతిస్తూ ఉంటారు కూడా.
అయితే బరువు తగ్గాలంటే మనం ఎన్ని కిలో మీటర్లు వాకింగ్ చేయాలి.. ఎంత సమయం వాకింగ్ చేయాలి.. అన్న సందేహాలు కూడా మనలో చాలా మందికి ఉన్నాయి. బరువు తగ్గాలంటే మనం రోజూ ఎన్ని కిలో మీటర్లు వాకింగ్ చేయాలి… అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి బరువు తగ్గాలంటే ఇన్ని కిలో మీటర్లు ఇంత సమయం వాకింగ్ చేయాలనే దానికి సరైన ఆధారాలు, సరైన రుజువులు లేవని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ తగ్గడానికి వాకింగ్ చేయడంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్న ప్రకారం రోజూ 1.6 కిలో మీటర్లు నడిస్తే 55 నుండి 140 క్యాలరీలు ఖర్చవుతాయని వారు చెబుతున్నారు.
అది కూడా మనం నడిచే వేగంపై ఆధారపడి ఉంటుందని వారు చెబుతున్నారు. అదే బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ వారు రోజూ 150 నిమిషాల పాటు నడవాలని చెబుతున్నారు. వేగంగా నడిచే వారు 75 నిమిషాల పాటు నడిస్తే సరిపోతుందని కూడా వారు చెబుతున్నారు. అలాగే రోజూ పది వేల అడుగులు నడిస్తే సరిపోతుందని మరికొందరు చెబుతున్నారు. ఇక మరికొంతమంది నిపుణులు బరువు తగ్గాలంటే చురుకైన వ్యాయామం అనగా మనం కనీసం గంటకు 6 కిలో మీటర్ల వేగంతో నడవాలని అంత కంటే ఎంత ఎక్కువగా నడిస్తే అంత వేగంగా బరువు తగ్గుతామని చెబుతున్నారు. అయితే మనం బరువు తగ్గడమనేది కేవలం మనం నడిచే నడకపైన ఆధారపడి ఉండదని మన శరీరతత్వం, మనం తీసుకునే ఆహారంపైన కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చక్కటి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటేనే ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని అప్పుడే మనం సులభంగా బరువు తగ్గగలమని నిపుణులు చెబుతున్నారు.