Walking In Nature : రోజూ 30 నిమిషాల పాటు ప్ర‌కృతిలో న‌డ‌వ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Walking In Nature : మ‌న శ‌రీర ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా చ‌క్క‌గా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లం. శారీర‌క ఆరోగ్యం బాగుండాలని మేలు చేసే ర‌క‌ర‌కాల ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. కానీ మాన‌సిక ఆరోగ్యం బాగుండ‌డానికి ఎవ‌రు ఎటువంటి ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌డం లేదు. నేటి త‌రుణంలో ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధప‌డే వారు ఎక్కువవుతున్నారు. చ‌దువు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఇలా ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి స‌మ‌స్య‌లు పెర‌గ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌నం అనేక ర‌కాల స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఇవి తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయి. క‌నుక వీటిని సాధ్య‌మైనంత దూరంగా ఉంచాలి.

ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా మ‌న‌సు ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉండాలంటే ప్ర‌కృతిలో ఎక్కువ‌గా గ‌డ‌పాల‌ని నిపుణులు చెబుతున్నారు. నేటి కాలంలో పెద్ద‌లు, పిల్ల‌లు ఎక్కువ‌గా సెల్ ఫోన్, వీడియో గేమ్స్, టివి వంటి వాటిని చూస్తూ కాలాన్ని గడుపుతున్నారు. వీటి వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లే త‌ప్ప ఎటువంటి లాభం కూడా లేదు. టివి, వీడియో గేమ్స్ ఆడ‌డానికి బ‌దులుగా క‌నీసం ఒక 30 నిమిషాల పాటు ప‌చ్చిగ‌డ్డిలో న‌డుస్తూ ప్ర‌కృతిని ఆస్వాదించ‌డం వల్ల మ‌నకు చ‌క్క‌టి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుకుంటూ స్వ‌చ్ఛ‌మైన గాలిని పీలుస్తూ ప్ర‌కృతిని ఆస్వాదించ‌డం వల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. మాన‌సికంగా ప్ర‌శాంతంగా ఉండ‌వ‌చ్చు.

Walking In Nature daily for 30 minutes gives these benefits
Walking In Nature

అలాగే ఈవిధంగా న‌డ‌వ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఆలోచ‌నా శ‌క్తి పెరుగుతుంది. ఇలా 30 నిమిషాల పాటు ప్ర‌కృతి ఒడిలో న‌డ‌వ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోగ‌లుగుతాము. దృష్టి, ఏకాగ్ర‌త వంటివి పెరుగుతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కుంగుబాటుకు లోన‌వ‌కుండా ఉంటారు. అధిక ర‌క్త‌పోటు, షుగ‌ర్ వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌వు. ఈ విధంగా రోజూ 30 నిమిషాల పాటు రోజూ ప్ర‌కృతితో గ‌డ‌ప‌డం వ‌ల్ల మ‌న శ‌రీర ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుప‌డుతుంద‌ని చాలా ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు మన ద‌రి చేర‌కుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts