Foods : మనం కూరగాయలు, పండ్లు, విత్తనాలు, ధాన్యాలు, గింజలు, ఆకుకూరలు ఇలా అనేక రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాము. వీటిలో కొన్నింటిని ఉడికించి, నానబెట్టి తీసుకుంటూ ఉంటాము. కొన్నింటిని నేరుగా తీసుకుంటూ ఉంటాము. కొన్నింటిని ఎవరికి నచ్చిన పద్దతిలో వారు తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం పచ్చిగా తీసుకోవడమే మేలని నిపుణులు చెబుతున్నారు. వాటిని పచ్చిగా తీసుకోవడం వల్ల మాత్రమే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వాటిలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి పూర్తిగా అందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మనం పచ్చిగా, నేరుగా తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం పచ్చిగా తీసుకోవాల్సిన ఆహారాల్లో ఉల్లిపాయ కూడా ఒకటి.
ఉల్లిపాయను మనం వంట్లలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఉల్లిపాయలను వేయించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని పచ్చిగా తీసుకోవడం వల్ల మాత్రమే మనకు మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. ఉల్లిపాయలల్లో యాంటీ ఆక్సిడెంట్లు, అల్లిసిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గుండె జబ్బులను తగ్గించడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో ఉపయోగపడతాయి. ఈ ప్రయోజనాలన్నింటిని మనం పొందాలంటే ఉల్లిపాయలను పచ్చిగా తీసుకోవడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అలాగే బీట్ రూట్ ను కూడా మనం పచ్చిగానే తీసుకోవాలి. జ్యూస్ రూపంలో లేదా సలాడ్ రూపంలో బీట్ రూట్ ను తీసుకోవాలి.
రక్తహీనతను తగ్గించడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా దోహదపడుతుంది. వేయించి, ఫ్రై చేసి, ఉడికించి బీట్ రూట్ ను తీసుకోకూడదని ఇలా తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాల్నింటిని దూరం చేసుకున్న వాళ్లమవుతామని నిపుణులు చెబుతున్నారు. అలాగే మనలో చాలా మంది మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా మొలకెత్తిన గింజలు మనకు దోహదపడతాయి. వీటిని కూడా మనం వీలైనంత వరకు పచ్చిగా తీసుకోవడానికే ప్రయత్నించాలి. కొందరు వీటిని వేయించి తీసుకుంటూ ఉంటారు. కొందరు కూరగా చేసి తీసుకుంటూ ఉంటారు.
ఇలా చేయడం వల్ల పోషకాలు ఆవిరైపోతాయి కనుక వీటిని కూడా పచ్చిగానే తీసుకోవాలి. అలాగే వంటలల్లో టమాటాలను విరివిరిగా వాడుతూ ఉంటాము. అయితే వేడి చేయడం వల్ల టమాటాలల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి కనుక వీటిని కూడా సలాడ్ రూపంలో పచ్చిగానే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే వెల్లుల్లిని పేస్ట్ గా చేసి లేదా దంచి వంటల్లో వాడుతూ ఉంటాము. అయితే వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవడమే మనకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిని తేనెతో కలిపి నమిలి మింగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా బ్రోకలీని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కొందరు వీటితో కూరలు కూడా చేస్తూ ఉంటారు. అయితే బ్రోకలీని ఒకటిలేదా రెండు నిమిషాల కంటే ఎక్కువగా వేయించకూడదని నిపుణులు చెబుతున్నారు. బ్రోకలీని ఎక్కువగా సలాడ్ రూపంలో తీసుకోవాలని అలా తీసుకుంటేనే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే మనలో చాలా మంది డ్రైఫ్రూట్స్ ను వేయించి తీసుకుంటూ ఉంటారు. ఉప్పు, కారం, మసాలా, నెయ్యి వేసి వేయించి వీటిని తీసుకుంటూ ఉంటారు. ఇలా అస్సలు తీసుకోకూడదని డ్రై ఫ్రూట్స్ నుకేవలం నానబెట్టి మాత్రమే తీసుకోవాలని అప్పుడూ వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.