Wearing Socks At Night : సాధారణంగా మన ఆఫీస్ లకు, ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు అలాగే పిల్లలైతే స్కూల్ కి వెళ్లేటప్పుడు మాత్రమే సాక్స్ ను ధరిస్తారు. సాక్స్ వేసుకోవడం వల్ల చూడడానికి చక్కగా ఉండడంతో పాటు పాదాలకు కూడా రక్షణగా ఉంటాయి. అలాగే చలికాలంలో చాలా మంది సాక్స్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. దీని వల్ల పాదాలు తేమను కోల్పోకుండా, పగుళ్లకుండా ఉంటాయి.
అయితే పగటి పూట మా్తరమే కాకుండా రాత్రి పడుకునేటప్పుడు సాక్స్ ను ధరించి పడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునేటప్పుడు సాక్స్ ధరించి పడుకోవడం వల్ల పాదాలకు రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ఇలా సాక్స్ ధరించి పడుకోవడం వల్ల పాదాల నొప్పులు, పాదాల వాపులు, తిమ్మిర్లు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే పాదాలు కూడా పొడిబారకుండా అందంగా కనిపిస్తాయి. అలాగే మోనోపాజ్ దశలో ఉండే స్త్రీలు నిద్రించేటప్పుడు సాక్స్ ను ధరించి నిద్రించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మోనోపాజ్ దశలో ఉండే స్త్రీలల్లో పాదాల మంటలు, పాదాల నుండి ఆవిర్లు వచ్చినట్టుగా ఉంటుంది.
దీంతో రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి వారు రాత్రి పడుకునే ముందు కాటన్ సాక్స్ ను వేసుకుని పడుకోవడం వల్ల పాదాల్లో కూడా ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి. పాదాల నుండి ఆవిరి వచ్చినట్టుగా ఉండడం, పాదాల్లో మంటలు కూడా తగ్గుతాయి. రాత్రి పూట నిద్రకు ఆటంకం కలగకుండా ఉంటుంది. ఈ విధంగా రాత్రిపూట సాక్స్ ను ధరించి పడుకోవడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.