సాధారణంగా వృత్తి నిపుణులకు నిద్రలేమి సమస్య వుంటుంది. పని ఒత్తిడి, అనారోగ్య జీవన విధానాలు నిద్రను వీరికి దూరం చేస్తాయి. మంచి నిద్ర పోవాలంటే, కొంతమంది నిద్రమాత్రలు వేస్తారు. ఈ మాత్రలు తాత్కాలికంగా మీకు నిద్ర పట్టించినప్పటికి శరీరానికి హాని చేస్తాయి. నిద్రమాత్రలు వేస్తే ఏం జరుగుతుంది? పరిశీలించండి. నిద్రమాత్రలు అలవాటు పడేలా చేస్తాయి. బెడ్ టైమ్ అయ్యిందంటే నిద్ర మాత్ర లేకుండా పడుకోలేరు. నిద్ర మాత్రలు మీ శ్వాసను నెమ్మదిస్తాయి. గాఢ శ్వాస లేకుండా చేస్తాయి. ఆస్తమా రోగులకు ఈ మందులు అసలు మంచివి కావు. కనుక వీరు నిద్రమాత్రలు తీసుకోరాదు.
నిద్రమాత్రలు మీ ఆకలిని చంపేస్తాయి. జీవక్రియ మందగిస్తుంది. కొంతమంది నిద్రమాత్రలు ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటారు. ఇది ప్రమాదకరం. మరణానికి దోవతీస్తుంది కూడాను. ద్రాక్షరసంతో కూడా కలిపి తీసుకోకండి. నిద్రమాత్రలు, మత్తు కలిగించి, ఉదయమే తలనొప్పి, అలసట, దాహం, బలహీనం, చూపు మందగించటం చేస్తాయి.
నిద్రపోయినప్పటికి అసాధారణ కలలు వస్తాయి. గోడలు కూలుతున్నట్లు, తల తిరుగుతున్నట్లు అనిపిస్తూంటుంది. నిద్రమాత్రల పవర్ అధికమైనవైతే, మీ శరీరం బలహీనపడటమే కాదు వణుకుతూ వుంటుంది. ఇవి నిద్రమాత్రలవలన కలిగే దుష్ప్రభావాలు. కనుక నిద్రమాత్రలను డాక్టర్ సలహాపైనే వేయండి. నమ్మకస్తులైన మందుల దుకాణంలో మాత్రమే కొనండి.