Beer : ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషుడు అనే బేధం లేకుండా అందరూ బీర్ ను తాగుతున్నారు. బీర్ తాగడం నేటి తరుణంలో అందరికి ఫ్యాషన్ గా మారుతుంది. ఇతరత్రా మద్యపానాలు తాగితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది బీర్ తాగితే ఏం కాదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ బీర్ ను తాగడం వల్ల మనందరిని ఎంతగానో ఇబ్బందికి గురి చేస్తున్న అధిక బరువు సమస్య బారిన పడకతప్పదని నిపుణులు చెబుతున్నారు. బీర్ కు బరువు పెరగడానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందని బీర్ తాగడం వల్ల కూడా మనకు ఇబ్బందులు తప్పవని వారు చెబుతున్నారు. బీర్ లో 5 శాతం ఆల్కాహాల్ ఉంటుంది. 100 ఎమ్ ఎల్ బీర్ లో 35 నుండి 40 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది.
ఒక బీర్ బాటిల్ తాగితే 200 క్యాలరీల శక్తి లభిస్తుంది. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ బీర్ బాటిళ్లు తాగుతూ ఉంటారు. దీంతో అధిక క్యాలరీలు శరీరంలోకి చేరుతాయి. అలాగే బీర్ తాగుతూ రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. దీంతో మరిన్ని క్యాలరీలు శరీరంలోకి చేరుతాయి. అలాగే బీర్ ను తాగడం మనం అధికంగా మినరల్స్ ను కోల్పోవాల్సి వస్తుంది. బీర్ లోకి ప్రవేశించిన బీర్ ను బయటకు పంపించడానికి యూరిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా ఎక్కువగా ఉత్పత్తి అయిన యూరిన్ లో ఉండే విటమిన్స్ ను, మినరల్స్ ను మూత్రపిండాలు తిరిగి గ్రహించుకుంటాయి. కానీ బీర్ తాగడం వల్ల విటమిన్స్, మినరల్స్ ను మూత్రపిండాలు గ్రహించుకునే శక్తి తగ్గుతుంది. దీంతో విటమిన్స్, మినరల్స్ మూత్రం ద్వారా ఎక్కువగా బయటకు పోతాయి. మినరల్స్, విటమిన్స్ కోల్పోవడం వల్ల రక్తంలో క్షారత్వం తగ్గుతుంది.
దీంతో ఎముకల్లో ఉండే క్యాల్షియం రక్తంలో కలిసి రక్తంలో క్షారత్వం తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. దీని కారణంగా ఎముకలు గుళ్ల బారుతాయి. బీర్ తాగడం వల్ల బరువు పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. బీర్ వంటి ఆల్కాహాల్ కలిపిన పానీయాలను తాగడం వల్ల శరీరానికి నష్టం కలగడంతో పాటు శరీరానికి లాభం కలిగించే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. బీర్ తాగడం వల్ల కాలేయంలో వ్యర్థాలను బయటకు పంపించే ప్రక్రియ ఆగిపోతుంది. బీర్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్, ఊబకాయం, బాణ పొట్ట వంటవి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.