Aloo Dosa : ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది అనేక రకాల ఆహారాలను తింటుంటారు. వాటిల్లో దోశలు కూడా ఒకటి. ఈ దోశలు అనేక రకాల వెరైటీల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. మసాలా దోశ, ఆనియన్ దోశ.. ఇలా భిన్న రకాల దోశలను తింటుంటారు. అయితే మీరెప్పుడైనా ఆలు దోశను తిన్నారా.. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దోశ అంటే ఇష్టం ఉన్న ఎవరైనా సరే ఈ ఆలు దోశలను కూడా ఇష్టపడతారు. వీటిని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే ఆలు దోశలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలు దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా – 1 కప్పు, శనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్లు, పచ్చి మిర్చి తరుగు – 1 టీస్పూన్, బంగాళాదుంపలు – 2 (తురుముకోవాలి), పసుపు – అర టీస్పూన్, కారం – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత, పాలకూర తరుగు – పావు కప్పు, నూనె – అర కప్పు.
ఆలు దోశలను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లను పోస్తూ దోశ పిండిలా చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి ఈ పిండిని దోశలా వేసి రెండు వైపులా నూనె వేస్తూ కాల్చుకుని తీసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన ఆలు దోశలు రెడీ అవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసే రెగ్యులర్ దోశలకు బదులుగా ఇలా ఒక్కసారి చేసి చూడండి. నచ్చుతాయి. అందరూ ఇష్టపడతారు.