శృంగారమంటే ఓ జంట మధ్య శారీరక సంబంధం మాత్రమే కాదు. అదొక పవిత్ర కార్యం. రెండు మనస్సులు ఒకటయ్యే వేదిక. అలాంటి కార్యం జరిగేటప్పుడు జంటల్లో ఆడ, మగ ఎవరైనా కొన్ని తప్పులు చేస్తుండడం సహజం. అవి ఏ విషయానికి చెందినవి అయినా కావచ్చు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది ఆడవారి గురించి. శృంగారం చేసే సమయంలో వారు చేసే చిన్నపాటి తప్పుల గురించే ఇక్కడ తెలుసుకుందాం. కానీ చాలా మంది ఆడవారు నిజానికి వాటిని తప్పులుగా అనుకోరు. అలాంటివేవో ఇప్పుడు చూద్దాం. శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ యాక్టివ్‌గా ఉండాలని చూస్తారట. తమదే పైచేయి కావాలని భావిస్తారట. నిజానికి అలా చేయాల్సిన అవసరం లేదట.
ముందే చెప్పాం కదా. శృంగారమంటే రెండు జంటల కలయిక మాత్రమే కాదు, రెండు మనస్సులు ఒక్కటవ్వడం అని. అలాంటప్పుడు, శృంగారంలో పాల్గొన్న సమయంలో కేవలం పురుషుడే స్త్రీని లాలనగా ఆప్యాయంగా చూడడమే కాదు, స్త్రీ కూడా అలాగే ప్రవర్తించాలి. శృంగారం పూర్తయ్యాక వెంటనే మాట్లాడుకోవాలని స్త్రీలకు ఉంటుందట. కానీ పురుషులు మాత్రం మాట్లాడడం కన్నా రిలాక్సేషన్‌కే అధిక ప్రాధాన్యతనిస్తారట. అలాంటి సమయంలో పురుషున్ని స్త్రీ అర్థం చేసుకుని కామ్‌గా ఉండాలట. శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీ పట్ల పురుషుడు అనుకోకుండా తప్పుగా ప్రవర్తిస్తే అప్పుడు స్త్రీలు అందుకు పురుషులను తప్పు పట్టకూడదు. అలా చేస్తే పురుషుల ఈగో దెబ్బ తిని వారి సంబంధంలో సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది.
శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషుడు స్త్రీ పట్ల ఎలా అయితే ప్రవర్తిస్తాడో, స్త్రీ కూడా తన పట్ల అలాగే ప్రవర్తించాలని పురుషుడు కోరుకుంటాడట. అలాంటి సందర్భాల్లో పురుషుడి కోరికను కాదనకూడదట. శృంగారం అన్నాక చుంబనాలు, చూషణలు, కొరకడాలు కామన్. అలాంటి సమయంలో నోటినే ఎక్కువగా వాడాలి తప్ప, దంతాలను కాదు. చాలా మంది పురుషులకు స్త్రీల జననావయవాల వద్ద వెంట్రుకలు ఉంటేనే ఇష్టమట. అలాగే ఆ ఇష్టం కొందరు స్త్రీలకు కూడా ఉంటుందట. ఈ క్రమంలో తమ భాగస్వామి అలవాటు ప్రకారం నడుచుకుంటే అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదట. శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీలు పలు ఫీలింగ్స్‌ను సొంతంగా ఎంజాయ్ చేయాలే తప్ప అవి వచ్చినట్టు నటించకూడదు. అంటే, రియల్ ఫీలింగ్స్ అయితేనే స్పందించాలి తప్ప నటించకూడదు.
శృంగారంలో స్త్రీ, పురుషులిద్దరికీ భావప్రాప్తి కలగడం సహజం. అయితే పురుషునికి స్కలనం అయితే స్త్రీకి తెలుస్తుంది, కానీ స్త్రీకి భావప్రాప్తి అయితే పురుషులకు సరిగ్గా తెలియదు. ఈ క్రమంలో స్త్రీలు భావప్రాప్తి అయినట్టు నటించకూడదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార భావనలు తగ్గిపోతుంటాయి. మరీ స్త్రీలలో అది ముందుగా జరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి ఉంటే స్త్రీలు పురుషులకు చెప్పాలి తప్ప తప్పించుకోకూడదు.