పీఎంఎస్, రుతు సమయంలో నొప్పులు అనేవి ప్రతి మహిళకు నెలకు ఒకసారి వస్తుంటాయి. దీంతో చెప్పలేని నొప్పి, బాధ కలుగుతాయి. ఆందోళనగా ఉంటారు. జీర్ణ సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను భరించలేకపోతుంటారు. దాదాపుగా 90 శాతం మంది మహిళలకు నెల నెలా ఇలాంటి సమస్యలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరికి మాత్రం ఈ నొప్పులు అధికంగా ఉంటాయి. దీంతో ఇంగ్లిష్ మెడిసిన్‌లను వాడుతుంటారు. కానీ వాటికి బదులుగా కింద తెలిపిన 5 మార్గాలను పాటిస్తే ఆయా నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. మరి ఆ మార్గాలు ఏమిటంటే..
1. రాత్రి పూట నీటిలో గుప్పెడు కిస్మిస్‌లను, కొద్దిగా కుంకుమ పువ్వును వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి వాటిని తినాలి. ఇలా చేస్తే రుతు సమయంలో నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. ఆ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది.
2. రుతు సమయంలో మహిళలు అరటి పండ్లను తింటుండాలి. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అరటి పండ్లలో విటమిన్ బి6, పొటాషియం ఉంటాయి. ఇవి గ్యాస్, నొప్పులను తగ్గిస్తాయి.
3. చిలగడ దుంపలు, ముల్లంగి, బీట్ రూట్‌లను మహిళలు రుతు సమయంలో తింటుండాలి. దీని వల్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. వీటిల్లో ఫైబర్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. పీరియడ్స్ నొప్పులను తగ్గిస్తాయి. అలాగే చర్మాన్ని సంరక్షిస్తాయి.
4. రుతు సమయంలో చిరు ధాన్యాలను తినడం వల్ల కూడా మహిళలు అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వాపులు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
5. రుతు సమయంలో మహిళలు రోజుకు మూడు పూటలా భోజనం చేసినప్పుడల్లా ఒక టీస్పూన్ నెయ్యిని తీసుకోవాలి. ఇది అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయాన్ని రక్షిస్తుంది. చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నొప్పులు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365