హెల్త్ టిప్స్

40 ఏళ్ల‌కు పైబ‌డిన మ‌హిళ‌లు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య నియ‌మాలు..!

సాధారణంగా మహిళలు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఇంట్లో ఉన్న అందరి బాగోగులు చూసుకుంటూ తమ గురించి మర్చిపోతారు. ఐతే మహమ్మారి వచ్చిన తర్వాత మధ్య వయస్సు మహిళలు ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఏర్పడింది. 45నుండి 60సంవత్సరాల వయస్సు గల మహిళల్లో అనారోగ్య సమస్యలు చాలా సాధారణం. మరి ఆ అనారోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. డయాబెటిస్, బీపీ హైపర్ టెన్షన్, క్యాన్సర్, డిప్రెషన్ మొదలగు సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కూరగాయలు, పండ్లు, చిరు ధాన్యాలు, గోధుమలు, బ్రౌన్ రైస్, మొలకలు, ఓట్స్ వంటివి ఆరోగ్యానికి మంచివి. అంతే కాక కొవ్వు తక్కువగా ఉండే, ఆలివ్ ఆయిల్, చేప, సూర్యపువ్వు మొదలగు వాటిని తీసుకోవాలి. ఉప్పు తక్కువ తీసుకోవాలి. రోజులో ఒక టీ స్పూన్ మాత్రమే తీసుకుంటే బెటర్. అది కూడా అయోడిన్ ఉన్న ఉప్పు అయితే బెటర్. మధ్య వయసుకి వచ్చాక బరువు పెరగడం సహజం. కానీ దాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువుని అదుపులో పెట్టుకోవాలి.

women who age above 40 must follow these tips

ఈ మధ్య ఆడ, మగ తేడా లేకుండా పొగ తాగడం అలవాటయ్యింది. మధ్య వయస్సు మహిళల్లో పొగ తాగే అలవాటు ఉంటే మానుకోవడం ఉత్తమం. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు తప్పవు. రెగ్యులర్ హెల్త్ చెకప్ చాలా అవసరం. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా ముందే తెలుసుకునే అవకాశంం ఉంటుంది.

Admin

Recent Posts