పాలీసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్.. దీన్నే పీసీవోఎస్ అంటారు. మహిళలకు ఈ సమస్య వస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. జన్యువుల ప్రభావం, ఇన్సులిన్ నిరోధకత, వాపులు.. వంటి ఇతర కారణాల వల్ల కూడా మహిళలల్లో పీసీవోఎస్ సమస్య వస్తుంటుంది. అయితే ఈ సమస్య ఉన్నవారికి సంతానం కలగడం కష్టంగా ఉంటుంది. ప్రతి 5 మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పీసీవోఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళల సంఖ్య 12 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే డాక్టర్ల పర్యవేక్షణలో మహిళలు చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. అయితే కింద తెలిపిన ఆహారాలను తీసుకోవడం వల్ల పీసీవోఎస్ ఉన్న మహిళలకు మేలు జరుగుతుంది. వాటితో ఆ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
1. పీసీవోఎస్ సమస్య ఉన్న మహిళలు రోజూ పప్పు దినుసులను తీసుకోవాలి. ముఖ్యంగా రాజ్మా, శనగలు, పెసలను తీసుకుంటే ఫలితం ఉంటుంది. వాటిల్లో ఉండే పోషకాలు హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. దీని వల్ల పీసీవోఎస్ సమస్య తగ్గుతుంది.
2. బాదం, పిస్తా, వాల్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతోపాటు విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి హార్మోన్ల సమస్యలను తగ్గిస్తాయి. అందువల్ల రోజూ గుప్పెడు మోతాదులో ఏవైనా నట్స్‌ను తింటుంటే పీసీవోఎస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
3. పుట్టగొడుగుల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి అనేక అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి. మహిళలు వీటిని తీసుకోవడం వల్ల పీసీవోఎస్ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు.
4. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఇన్సులిన్ నిరోధకతను, వాపులను తగ్గిస్తాయి. కనుక పీసీవోఎస్ సమస్య ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి.
5. ఆకుపచ్చని కూరగాయల్లో బి విటమిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల రోజూ కూరగాయలు, ఆకుకూరలను తినాలి. ఇవి మహిళల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. పీసీవోఎస్‌ను తగ్గిస్తాయి.