ప్రపంచ వ్యాప్తంగా ఏటా థైరాయిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి 10 మందిలో 4 మందికి థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే థైరాయిడ్ సమస్యలు వచ్చిన వారు ఇతర లక్షణాలతోనూ బాధపడుతున్నారు. అయితే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు పలు ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి కలిగే లక్షణాల నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయోడిన్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. దీని వల్ల ఆ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది. సమస్యలు తగ్గుతాయి. అయోడిన్ మనకు ఎక్కువగా సీఫుడ్, కోడిగుడ్లు, క్రాన్ బెర్రీలు, పెరుగు, స్ట్రాబెర్రీలు, చేపలు, టర్కీ, ఆలుగడ్డలు, సైంధవ లవణంలో లభిస్తుంది.
2. చేపలను ఆహారంలో భాగం చేసుకున్నా థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి.
3. పాలు, పెరుగు, చీజ్ వంటి ఆహారాలను రోజూ తీసుకుంటుండాలి. వాటిల్లో కాల్షియం, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. అవి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తాయి.
4. అతి మధురం చూర్ణంను రోజూ పాలతో తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేస్తుంది. హార్మోన్లు సమతుల్యం అవుతాయి.
5. సోయా ఉత్పత్తులను తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది.