హెల్త్ టిప్స్

భోజ‌నం త‌రువాత రెండు యాల‌కుల‌ను తినాల్సిందే.. ఎందుకో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

యాలకులను సుగంధ ద్రవ్యాలకి రాణి అని పిలుస్తుంటారు. ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వాస్తవానికి మార్కెట్ లో యాలకుల ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీటిని సాగు చేయడమనేది ఎక్కువ శ్రమతో కూడిన పని. అయితే ధర ఎంత ఎక్కువ ఉన్నా కూడా జనాలు యాలకులను కచ్చితంగా కొనుగోలు చేస్తారు.

దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో యాలకులు కచ్చితంగా ఉండి తీరాల్సిందే. వీటిని టీ నుంచి మొదలుకొని వివిధ రకాల స్వీట్లు, వంటకాల్లో ఎక్కువగా వాడతారు. యాలకుల్లో ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు అధికంగా ఉంటాయి. అందువలన యాలకులు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. అంతే కాకుండా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను తొలగిస్తాయి. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే పొటాషియం గుండె పని తీరును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

you should definitely take cardamom after meals know why

యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో సహాయపడుతాయి. యాలకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఇందులో ఉంటాయి. యాలకులలలో ఉండే లక్షణాలు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, మూడ్ స్వింగ్ తో బాధపడుతున్న వ్యక్తుల మూడ్‌ని మార్చడానికి సహాయపడతాయి. ప్రతిరోజు టీలో యాలకులను వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

యాలకులు నోటి దుర్వాసనని పోగొట్టడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. రోజూ యాలకులు తినడం వలన దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత ఒక ఇలాచి నోట్లో వేసుకొని నెమ్మదిగా నమలితే ఇందులో ఉండే గుణాలు నోటి దుర్వాసనని పోగొట్టి సువాసనలు వెదజల్లుతాయి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తింటే పురుషులకు ఉండే శీఘ్రస్కలన సమస్యను నివారిస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలను మెరుగుపరుస్తాయి.

Admin

Recent Posts