బొప్పాయి పండ్లు మనకు సహజంగానే ఏడాది పొడవునా ఎప్పుడైనా లభిస్తాయి. ఈ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మనకు కలిగే అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అందువల్ల బొప్పాయి పండ్లను ఎల్లప్పుడూ తినాలి. ముఖ్యంగా వర్షాకాలం సీజన్‌లో ఈ పండ్లను కచ్చితంగా తీసుకోవాలి. దీని వల్ల ఈ సీజన్‌లో వచ్చే అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
వర్షాకాలంలో సహజంగానే మన శరీరంపై దాడి చేసేందుకు అనేక రకాల సూక్ష్మక్రిములు సిద్ధంగా ఉంటాయి. దీంతో ఈ సీజన్‌లో మనకు జ్వరం, దగ్గు, జలుబు, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. కనుక బొప్పాయి పండ్లను తినడం వల్ల ఆయా వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. దీంతో ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉంటారు.
బొప్పాయి పండ్లను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజన్‌లో మనకు అది తప్పనిసరిగా ఎక్కువగానే ఉండాలి. వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలను అడ్డుకునేందుకు బొప్పాయి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ సీజన్‌లో కచ్చితంగా ఈ పండ్లను తినాలి. వీటిని రోజూ ఒక కప్పు మోతాదులో తినాలి. సాయంత్రం సమయంలో స్నాక్స్ తినేబదులు ఈ పండ్లను తింటే మంచిది. దీంతో అనారోగ్యాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
ఇక బొప్పాయి పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ సీజన్‌లో మనం తినే ఆహారం, తాగే ద్రవాలు ఫుడ్ పాయిజన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల బొప్పాయి పండ్లను తింటే ఆయా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మనం తినే ఆహారం, తాగే ద్రవాల్లో ఉండే సూక్ష్మక్రిములను బొప్పాయి పండ్లలోని సమ్మేళనాలు చంపేస్తాయి. దీంతో విరేచనాలు, వాంతులు కాకుండా చూసుకోవచ్చు. అలాగే మలబద్దకం, గ్యాస్, అజీర్ణం తగ్గుతాయి.
అందువల్ల ఎటు చూసినా మనకు ఈ సీజన్‌లో బొప్పాయి పండ్ల వల్ల లాభాలే కలుగుతాయి. కాబట్టి వీటిని ఈ సమయంలో కచ్చితంగా తినాలి. వీటిని రోజూ తినడం అలవాటు చేసుకోండి. ఆయా సమస్యల బారిన పడకుండా చూసుకోండి..!
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365