తేనెను రోజూ తీసుకుంటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

తేనె మ‌న‌కు ప్ర‌కృతిలో ల‌భించే అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థం. ఆయుర్వేద ప్ర‌కారం ఇందులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. తేనెలో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ క్ర‌మంలోనే తేనెను రోజూ తీసుకోవాల‌నుకునేవారు, ఇప్ప‌టికే తీసుకుంటున్న వారు క‌చ్చితంగా తేనె గురించి ఈ నిజాల‌ను తెలుసుకోవాలి. అవేమిటంటే..

తేనెను రోజూ తీసుకోవాల‌నుకునేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు..!!

1. తేనె స‌హ‌జ‌సిద్ధ‌మైన శ‌క్తినిచ్చే ప‌దార్థం. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. నీర‌సం, అల‌స‌ట త‌గ్గుతాయి.

2. తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

3. తేనెను తీసుకుంటే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు.

4. కాలిన గాయాలు, పుండ్ల‌పై తేనెను రాస్తుంటే అవి త్వ‌ర‌గా మానుతాయి. అలాగే చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వాపులు, నొప్పుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య నుంచి తేనె బ‌యట ప‌డేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక బ‌రువు త‌గ్గేందుకు తేనె ఉప‌యోగ‌ప‌డుతుంది.

6. తేనె వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చుండ్రును త‌గ్గిస్తుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

తేనె వ‌ల్ల లాభాలు క‌ల‌గాలంటే దాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్ల‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు. లేదా అర టీస్పూన్ మిరియాల పొడి, ఒక టీస్పూన్ తేనె క‌లిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. లేదా రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా తేనె క‌లిపి తీసుకోవాలి. ఈ విధంగా తేనెను తీసుకుంటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

అయితే తేనెను ఎప్పుడూ వేడి చేయ‌రాదు. చేస్తే అందులో ఉండే పోష‌కాలు న‌శిస్తాయి. అలాగే తేనెను వేడి ప‌దార్థాల‌తో క‌ల‌ప‌రాదు. గోరు వెచ్చ‌గా ఉండే వాటిలో క‌లిపి వెంట‌నే తీసుకోవాలి. దీంతో పోష‌కాలు న‌శించ‌కుండా ఉంటాయి.

ఇక స్వ‌చ్ఛమైన తేనె ఎలాంటి ప్రిజ‌ర్వేటివ్స్ క‌ల‌ప‌కుండా ఎన్నేళ్ల‌పాటు అయినా అలాగే ఉంటుంది. అందువ‌ల్ల మార్కెట్‌లో స్వ‌చ్ఛ‌మైన తేనె లేదా ఆర్గానిక్ తేనెను కొని తీసుకుంటే మంచిది.

Admin

Recent Posts