మన శరీరం మూడో వంతు నీళ్లతో నిర్మితమై నీటిమీదే ఆధారపడి ఉంది. శరీరానికి నీరు చాలా అవసరం అని అందరికీ తెలిసినప్పటికీ దాన్ని అశ్రద్ద చేస్తారు.., ఎవరినైనా రోజుకు ఎన్ని నీళ్ళు తాగుతున్నావ్ అని అడిగితే చాలా తాగుతున్నాం అని అంటారు కాని సాధారణంగా ఒకటి లేదా రెండు లీటర్లకు మించి తాగరు. శరీరానికి అవసరమైన నీరు సరైన నిష్పత్తిలో అందకపోతే శరీరం కొన్ని సంకేతాలు మనకు పంపుతుంది వాటిని ఆదిలోనే గ్రహించి తగు చర్యలు తీసుకోకుంటే ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదం ఉంది.. మీరు కింది వాటిల్లో దేనితో ఇబ్బంది పడుతున్నా దానికి కారణం మీ శరీరానికి అవసరమైన నీరు మీరు త్రాగకపోవడమే.. ఇకనైనా మేల్కొని చాలా నీరు తాగండి.
తరచుగా తలనొప్పి బాధిస్తుంటే దానికి ఒక కారణం కూడా శరీరం లోని నీటిలోపం కావొచ్చు. డీహైడ్రేషన్ కారణంగా తల బాగా పట్టేసినట్లు ఉండి తలనొప్పి కలుగుతుంది. మలబద్దకం బాధిస్తుందంటే అది డీహైడ్రేషన్ కి సంకేతం లా భావించాలి, శరీరంలో సరిపడా నీరు లేకపోవడం వలన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయక మలబద్దకానికి కారణం అవుతుంది. లోబిపి కూడా డీహైడ్రేషన్ ఒక కారణం. శరీరనికి సరైన మోతాదులో నీరు అందకపోతే రక్త ప్రసరణలో మార్పులు జరిగి గుండె వేగం ప్రభావితమవుతుంది.
శరీరానికి తగు మోతాదులో నీరు అందకుంటే మూత్రం సాధారణం కంటే ముదురు రంగులో చిక్కగా వస్తుంది. నీరు త్రాగక పోతే ఆ ప్రభావం మూత్ర పిండాలపై కూడా పడి ఆ ప్రాంతంలో నొప్పి వస్తుంది..కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి దారి తీస్తుంది. శరీరం లోని కండరాలు, ఇతర భాగాలు తిమ్మెర్లు బాగ పడుతున్నాయంటే అది కూడా శరీరంలోని గల తక్కువ నీటి వలననే. శరీరంలో నీరు తగ్గడం వలన రక్త ప్రసరణ సరిగ్గా జరగక తిమ్మెర్లు మొదలవుతాయి. శరీరానికి నీరు తక్కువైనప్పుడు దాని ప్రభావం చర్మంపై పడుతుంది. దీనివలన చర్మం సాగినట్లుగా, వాడిపోయినట్లుగా మారుతుంది..
మనిషి ఆరోగ్యంగా ఉన్నా కూడా కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే దానికి కారణం శరీరానికి సరిపడా నీరు అందకపోవడమే. రోజూ సరైన మోతాదులో నీరు తీసుకోనట్లైతే కండరాలకు రక్త ప్రసరణ తగ్గి కీళ్ళ నొప్పులు వస్తాయి. అసలే ఇది సమ్మర్ ..ఎండలు విపరీతంగా ఉన్నాయి..వాటర్ ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది.