సాధారణంగా చాలా మంది సాయంత్రం సమయంలో స్నాక్స్ పేరిట జంక్ ఫుడ్ తింటుంటారు. నూనె పదార్ధాలు, బేకరీ ఐటమ్స్‌ను తింటారు. అయితే వాటికి బదులుగా బాదంపప్పును తింటే ఎంతో మేలు జరుగుతుంది. రోజూ సాయంత్రం స్నాక్స్ రూపంలో నానబెట్టిన బాదం పప్పును తింటుండాలి. దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
1. బాదంపప్పును తినడం వల్ల శరీరంలో సెరొటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మూడ్‌ను నియంత్రిస్తుంది. అందువల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది.
2. బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది అల్జీమర్స్, క్యాన్సర్లు, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
3. బాదంపప్పులో కాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్, విటమిన్ కె, ప్రోటీన్లు, కాపర్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
4. బాదంపప్పును తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె పోటు రాకుండా నివారించవచ్చు.
5. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ బాదంపప్పును తినడం వల్ల షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
6. అధిక బరువు తగ్గాలనుకునే వారికి బాదంపప్పు ఎంతగానో మేలు చేస్తుంది. వీటిని రోజూ తినడం వల్ల ఫైబర్, ప్రోటీన్లు అందుతాయి. ఇవి బరువును తగ్గించడంలో దోహదపడతాయి.
7. బాదంపప్పును నానబెట్టి తినడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతాయి. కావల్సిన పోషకాలు అందుతాయి.