పొట్ట దగ్గరి కొవ్వు, అధిక బరువును తగ్గించే 6 రకాల ‘టీ’లు..!

అధిక బరువు అనేది ప్రస్తుతం అనేక మందికి సమస్యగా మారింది. కొందరికి పొట్ట దగ్గర కొవ్వు కూడా అధికంగా ఉంటోంది. దీంతో వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద తెలిపిన ‘టీ’ లను తరచూ సేవించడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. అలాగే పొట్ట దగ్గర ఉండే కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ ‘టీ’ లు ఏమిటంటే…

6 teas for belly fat and over weight

1. గ్రీన్ టీ

ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక టీస్పూన్‌ గ్రీన్‌ టీ ఆకులు వేసి 5 నిమిషాల పాటు ఉంచి తరువాత గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో అధిక బరువు తగ్గవచ్చు. గ్రీన్‌ టీని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

2. అల్లం టీ

మన ఇండ్లలో ఉండే అల్లంతోనూ టీ ని తయారు చేసుకుని నిత్యం తాగవచ్చు. రెండు కప్పుల నీటిని తీసుకుని అందులో చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. తరువాత ఆ నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, అర టీస్పూన్‌ నిమ్మరసం కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో బరువు తగ్గుతారు.

3. దాల్చినచెక్క టీ

రెండు కప్పుల నీటిని తీసుకుని అందులో చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసి బాగా మరిగించాలి. అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, అర టీస్పూన్‌ నిమ్మరసం కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి.

4. పసుపు, దాల్చిన చెక్క టీ

రెండు కప్పుల నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపు, ఒక టేబుల్‌ స్పూన్‌ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల తురిమిన అల్లం వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెను కలిపి తాగాలి.

5. బ్లాక్‌ టీ

టీ పొడితో డికాషన్‌ తయారు చేసి అది గోరు వెచ్చగా ఉండగా అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెను కలిపి తాగాలి. అవసరం అనుకుంటే అర టీస్పూన్‌ నిమ్మరసం కలుపుకుని కూడా తాగవచ్చు.

6. పుదీనా టీ

రెండు కప్పుల నీటిలో 7 నుంచి 10 పుదీనా ఆకులను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిలో ఒక టీస్పూన్‌ తేనె, అర టీస్పూన్‌ నిమ్మరసం కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి.

పైన తెలిపిన ఆరు టీలను తరచూ తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడమే కాకుండా, పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

 

Admin

Recent Posts