అధిక బరువును తగ్గించే మందార పువ్వుల టీ.. ఇలా తయారు చేయాలి..!

అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్నవారికి, స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నవారికి మందార పువ్వులతో తయారు చేసే టీ చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మందార పువ్వుల్లో పాలీఫినాల్స్, ఆంథోసయనిన్స్‌, ఫినోలిక్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం ఇవి శరీరంపై కింద తెలిపిన ప్రభావాలను కలగజేస్తాయి.

adhika baruvu mandara puvvula tea

1. మందార పువ్వుల్లో ఉండే ఆయా సమ్మేళనాలు లివర్‌లో కొవ్వు పదార్థాలను పేరుకుపోకుండా చూస్తాయి.

2. చిన్న పేగులు మనం తినే ఆహారాల్లో ఉండే కొవ్వులను శోషించుకోవు. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే శరీరంలో అప్పటికే ఉన్న కొవ్వు కరుగుతుంది.

3. ఇన్సులిన్‌ నిరోధకత తగ్గుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది.

మందారం పువ్వుల టీ వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధికంగా ఆవలి అవకుండా ఉంటుంది. దీంతో ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఇది అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడుతుంది.

గ్రీన్‌ టీ లా మందార పువ్వుల టీ టేస్ట్‌ ఉండదు. భిన్నంగా ఉంటుంది. గ్రీన్‌ టీ ని తాగలేని వారు మందార పువ్వుల టీ ని తాగవచ్చు. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

మందార పువ్వుల టీ ని ఇలా తయారు చేయాలి

400 ఎంఎల్‌ మోతాదులో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీరు మరిగాక స్టవ్‌ ఆర్పి అందులో ఎండబెట్టిన మందార పువ్వులను ఒక టేబుల్‌ స్పూన్‌ మోతాదులో వేయాలి. పైన మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. దీంతో మందార పువ్వుల్లోని సారం నీటిలోకి చేరుతుంది. తరువాత ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. ఇలా మందార పువ్వుల టీని తయారు చేసుకుని రోజుకు మూడు సార్లు తాగాలి. భోజనానికి అర గంట ముందు లేదా భోజనానికి భోజనానికి మధ్యలో తాగవచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతుంది.

అయితే ఈ టీలో చక్కెరను ఎట్టి పరిస్థితిలోనూ కలపరాదు. తీపి అవసరం అనుకుంటే తేనె లేదా బెల్లం కలుపుకోవచ్చు. అయితే ఇదే టీని చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టి అందులో ఐస్‌ ముక్కలు వేసి కూడా తాగవచ్చు. ఎలా తాగినా ప్రయోజనాలే కలుగుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts