Turmeric Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పసుపును వంటల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని మనం ఎంతో కాలం నుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నాం. అయితే పసుపును వంటల్లో వాడడం కన్నా నేరుగా తీసుకుంటేనే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ క్రమంలోనే పసుపుతో టీ తయారు చేసుకుని రోజూ పరగడుపునే తాగవచ్చు. ఇలా తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక వ్యాధులను తగ్గించే శక్తిని కూడా పసుపు కలిగి ఉంటుంది. కనుక పసుపుతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
పసుపుతో టీ తయారు చేసుకుని రోజూ పరగడుపునే తాగితే ఎంతో మేలు జరుగుతుంది. ఇక పసుపు టీని ఎలా తయారు చేయాలంటే.. ఒక గిన్నెల్లో ఒక కప్పున్నర నీళ్లను తీసుకోవాలి. ఆ నీటిని మరిగించాలి. నీరు కొద్దిగా వేడి అయ్యాక అందులో చిన్న పసుపు కొమ్మును దంచి వేయాలి. తరువాత రెండు నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం స్టఫ్ ఆఫ్ చేసి దింపేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వడబోయాలి. అనంతరం అందులో కాస్త మిరియాల పొడి, తేనె వేసి కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా పసుపు టీని రోజూ పరగడుపునే తాగితే అనేక లాభాలను పొందవచ్చు.
పసుపు టీని తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పసుపులో కర్‌క్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. అలాగే బీపీ నియంత్రణలోకి వస్తుంది.
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కనుక బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. జ్వరం వచ్చిన వారు ఇలా పసుపు టీని తయారుచేసుకుని తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. అలాగే అధిక బరువు ఉన్నవారు ఈ టీని నెల రోజుల పాటు తాగితే శరీరంలో చెప్పుకోదగిన మార్పు వస్తుంది.
పసుపు టీని తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం కరిగిపోతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక పసుపు టీని రోజూ తాగాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.