అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం.. వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. చాలా మందికి ఈ సమస్యలు అన్నీ ఉంటున్నాయి. అయితే మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యలన్నింటికీ ఒకే దెబ్బలో చెక్ పెట్టవచ్చు. అందుకు గాను వాటితో ఒక పానీయాన్ని తయారు చేసి రోజూ తీసుకోవాలి. మరి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఒక పాత్రలో లీటర్ నీటిని తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయను అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. పొట్టుతో సహా నిమ్మకాయను కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేయాలి. అలాగే 4 చిన్న అల్లం ముక్కలను పొట్టుతో సహా వేయాలి. 10 పుదీనా ఆకులను కూడా నీటిలో వేయాలి. ఇప్పుడు నీటిని బాగా మరిగించాలి.
నీరు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత పాత్రపై మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంతో ఆ నీరు గోరు వెచ్చగా అవుతుంది. అప్పుడు ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తాగేయాలి.
ఈ డ్రింక్‌ను ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. ఇలా కనీసం 30 రోజుల పాటు చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. పైన చెప్పిన అన్ని సమస్యలు ఈ ఒక్క డ్రింక్‌తో నయమవుతాయి.
అధిక బరువు ఉన్నవారు, పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నవారు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాను పాటించవచ్చు. దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది.
అల్లం, నిమ్మరసం, తేనెలు అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించేస్తాయి. అలాగే పుదీనా జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇలా అన్ని రకాల సమస్యలు ఈ చిట్కా వల్ల తగ్గుతాయి. అంతేకాదు, శరీరంలో ఉండే వ్యర్థాలు కూడా బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.