దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. దాల్చినచెక్క మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. దాల్చిన చెక్కను సహజంగానే పలు రకాల వంటకాల్లో వేస్తుంటారు. దీంతో వాటికి చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్కతో తయారు చేసే టీని రోజూ రాత్రి నిద్రించే ముందు తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. దాల్చిన చెక్క టీని రాత్రి నిద్రించేముందు తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. ఆ సమయంలో మన మెటబాలిజం నెమ్మదిస్తుంది. కానీ ఈ టీని తాగితే మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోదు, కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు.
2. దాల్చిన చెక్క టీని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఈ టీని రోజూ తాగితే ఎంతో మంచిది. దీంతో గుండె జబ్బులు రావు.
3. సాధారణంగా హార్ట్ ఎటాక్‌లు రాత్రి పూట వస్తుంటాయి. కానీ దాల్చిన చెక్క టీని తాగడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. దీంతో గుండె సురక్షితంగా ఉంటుంది.
4. దాల్చిన చెక్క టీని తాగడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
5. జీర్ణ సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్క టీని రోజూ తాగితే మంచిది. దీంతో మలబద్దకం ఉండదు. అజీర్ణం, గ్యాస్ తగ్గుతాయి.
6. ఈ టీని రోజూ తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
దాల్చిన చెక్క టీని తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు
- నీళ్లు – 1 కప్పు
- దాల్చిన చెక్క పొడి – 1 టీస్పూన్
- తేనె – 1 టీస్పూన్
- నల్ల మిరియాల పొడి – పావు టీస్పూన్
- నిమ్మరసం – టీ స్పూన్
తయారు చేసే విధానం
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. నీరు బాగా మరిగాక అందులో తేనె, నిమ్మరసం వేసి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ టీని రాత్రి నిద్రకు ముందు తాగితే పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365