కరోనా సెకండ్ వేవ్ భీభత్సం సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే కోవిడ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌లను విధిస్తున్నారు. ప్రజలు ఇళ్ల వద్దే ఉంటున్నారు. ఫేస్ మాస్క్‌లను ధరిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తున్నారు. అయితే ఈ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఆవశ్యకంగా మారింది.
రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు అనేక రకాల కషాయాలు, టీలు సేవిస్తున్నారు. అయితే ఉసిరికాయలు, మునగ ఆకులతో తయారు చేసే కషాయాన్ని తాగడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలన్న సంగతి తెలిసిందే. నారింజలు, పైనాపిల్, బత్తాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇక ఉసిరికాయలు, మునగ ఆకులతో కషాయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయలనే ఆమ్లా అని పిలుస్తారు. దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా అంటారు. దీంట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరికాయ పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దాన్ని తీసుకున్నా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఐరన్‌ను ఎక్కువగా శోషించుకునేలా చేస్తాయి. దీంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మునగ ఆకులు లభించకపోతే వాటికి బదులుగా కొత్తిమీర ఆకులను కూడా వాడవచ్చు.
బ్లెండర్‌లో అన్ని పదార్థాలను వేసి మిశ్రమంగా పట్టుకోవాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని వడకట్టాలి. దాన్ని ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365