Instant Coffee : టీ, కాఫీలను మనం సహజంగానే రోజూ తాగుతుంటాం. అయితే వీటి తయారీకి కాస్త సమయం పడుతుంది. కానీ కొన్ని సందర్బాల్లో మనం ఏవైనా అర్జెంట్ పనుల్లో ఉన్నప్పుడు వీటిని తయారు చేసుకోకుండా బయట తాగుతుంటాం. అయితే అలాంటి సమయాల్లోనూ ఉపయోగపడే విధంగా ముందుగానే కాఫీ పౌడర్‌ను కలిపి పెట్టుకోవచ్చు. దీనికి కాసిన్ని వేడి నీళ్లు కలిపితే చాలు.. కాఫీ తయారవుతుంది. ఇది చాలా త్వరగా అవుతుంది. ఇక ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ కాఫీ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇన్ స్టాంట్ కాఫీ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార – 3 టేబుల్ స్పూన్స్, పాల పొడి – 6 టేబుల్ స్పూన్స్, వేడి నీళ్లు – ఒక కప్పు.
ఇన్ స్టాంట్ కాఫీ పౌడర్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఇన్ స్టాంట్ కాఫీ పౌడర్, పంచదార, పాలపొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీనిని మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ మిశ్రమం 4 నుండి 5 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇలా నిల్వ చేసుకున్న కాఫీ పొడితో ఎంతో రుచిగా ఉండే కాఫీని తయారు చేసుకుని తాగవచ్చు. ఇంట్లో పాలు లేనప్పుడు లేదా సమయం లేని వారు అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకున్న కాఫీ మిశ్రమంతో కాఫీని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు కాఫీకి గాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కాఫీ మిశ్రమాన్ని వేసి వేడి నీళ్లను పోసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ కాఫీ తయారవుతుంది. పాలు లేకున్నా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే కాఫీని ఇలా తయారు చేసుకుని తాగవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది.