ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ కళ్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. ఫలితంగా కంటి సమస్యలు వస్తున్నాయి. కళ్లు నొప్పులు రావడం, దురదలు పెట్టడం, కంటి చూపు సరిగ్గా లేకపోవడం.. వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అస్తవ్యవస్తమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఎక్కువ సమయం పాటు స్క్రీన్‌లను చూడడం.. వంటివి కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే కంటి చూపు మందగిస్తోంది.
చిన్నారులు కూడా ఎక్కువ సమయం పాటు ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల ఎదుట గడుపుతున్నారు. దీంతో కంటి సమస్యలు వస్తున్నాయి. అయితే కంటి సమస్యలు తగ్గడంతోపాటు కంటి చూపు మెరుగు పడాలంటే అందుకు కింద తెలిపిన జ్యూస్‌లను తరచూ తాగాలి. దీంతో కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ జ్యూస్ లు ఏమిటంటే..
కంటి చూపును మెరుగు పరచడంలో క్యారెట్లు అద్భుతంగా పనిచేస్తాయి. క్యారెట్లలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగాలి.
పాలకూరలో విటమిన్లు ఎ, సి, కె, మెగ్నిషియం, మాంగనీస్, ఐరన్‌లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కంటి చూపు మెరుగు పడుతుంది. రోజూ పాలకూర జ్యూస్‌ను తాగుతున్నా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ఉసిరికాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కళ్లకు మేలు చేస్తుంది. కనుక ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగవచ్చు.