Anemia : ప్రస్తుత కాలంలో చాప కింద నీరులా పాకుతున్న అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఈ సమస్యను మనం ఎక్కువగా స్త్రీలలో చూడవచ్చు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, ప్రసవం సమయంలో ఎక్కువగా రక్తాన్ని కోల్పోవడం వంటి వివిధ కారణాల వల్ల స్త్రీలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతుంటారు. కానీ ఈ మధ్య చిన్న పిల్లల్లో, పురుషుల్లో కూడా ఈ సమస్య ఎక్కవగా కనబడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత సమస్య కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొవాల్సి వస్తోంది.
రక్తహీనత సమస్య బారినపడినప్పుడు నీరసం, తలతిరగడం, శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి తరచూ రోగాల బారిన పడడం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, చర్మం, గోళ్లు పాలిపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి మనం మందులను మింగడానికి బదులుగా మనం రోజూ తినే ఆహారాలలో రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాలతో ఒక డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్యను తగ్గించే ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ డ్రింక్ ను తాగడం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడే వారికి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గాను మనం ఒక గ్లాస్ పాలను, 4 ఖర్జూరాలను, ఒక టీ స్పూన్ నెయ్యిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకుని అందులో ముక్కలుగా చేసుకున్న ఖర్జూరాలను అలాగే నెయ్యిని వేసి కలపాలి. తరువాత పాలను స్టవ్ మీద ఉంచి పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. తరువాత ఈ పాలను చల్లగా అయ్యే వరకు ఉంచి ఒక జార్ లోకి తీసుకుని ఖర్జూరాలు మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.
ఈ పాలను పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. ప్రతిరోజూ తీసుకోలేని వారు ఈ పాలను తాగలేని వారు కనీసం వారానికి రెండు నుండి మూడు సార్లైనా తీసుకోవాలి. ఈ చిట్కా తయారీలో ఉపయోగించిన పాలు, ఖర్జూరాలు, నెయ్యి.. ఇవి అన్నీ కూడా మన శరీరానికి మేలు చేసేవే. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పైన తెలిపిన విధంగా మిల్క్ షేక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మనం రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.