Liver : మన శరీరంలో ఉన్న అనేక అవయవాల్లో లివర్ ఒకటి. అంతర్గతంగా ఉండే అతి పెద్ద అవయవం లివర్ మాత్రమే. ఇది మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమై మనకు శక్తి లభించేలా చేస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి శరీరానికి అందిస్తుంది. అలాగే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది. కానీ మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల లివర్ పనితీరు మందగిస్తుంటుంది. దీంతో అనేక సమస్యలు వస్తుంటాయి.
లివర్ ఆరోగ్యంగా లేకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అజీర్ణంగా ఉంటుంది. ఆకలి అసలు ఉండదు. ఏమీ తినాలనిపించదు. నూనె పదార్థాల వాసనలను చూస్తే వికారంగా అనిపిస్తుంది. ఇలా లివర్ అనారోగ్యంగా ఉందని తెలుసుకోవచ్చు. అయితే కింద చెప్పిన విధంగా ఓ జ్యూస్‌ను తయారు చేసుకుని మూడు రోజుల పాటు వరుసగా తాగితే చాలు. లివర్ దెబ్బకు క్లీన్ అవుతుంది. అందులో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఆ జ్యూస్‌ను ఎలా తయారు చేయాలంటే..
ఒక క్యారెట్, సగం కీరదోస ముక్క, ఒక నిమ్మకాయ, సగం బీట్‌రూట్, కొన్ని పుదీనా ఆకులు, కొన్ని కొత్తిమీర ఆకులు తీసుకోవాలి. నిమ్మకాయ కాకుండా మిగిలిన అన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్‌లా పట్టుకోవాలి. ఆ జ్యూస్‌లో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండాలి. అనంతరం ఆ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తినకూడదు. తాగకూడదు. ఇలా 3 రోజుల పాటు వరుసగా తాగాల్సి ఉంటుంది. దీంతో లివర్ మొత్తం శుభ్రం అవుతుంది.
అయితే లివర్ శుభ్రంగా మారి మళ్లీ యథావిధిగా పనిచేస్తే ఎప్పటిలా తిన్న ఆహారం జీర్ణం కావడంతోపాటు ఆకలి కూడా బాగా అవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. లివర్ ఆరోగ్యంగా ఉన్నట్లే. కనుక ఈ జ్యూస్‌ను తాగడం ఆపేయవచ్చు. అలా కాకుండా 3 రోజులకు కూడా ఈ లక్షణాలు కనిపించకపోతే.. మళ్లీ ఇంకో 3 రోజులు తాగాలి. ఇలా చేస్తే కచ్చితంగా లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.