Weight Loss Tips : అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు.. ఈ రెండు సమస్యలు ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొందరు అధికంగా బరువు ఉండరు.. కానీ పొట్ట దగ్గర కొవ్వు మాత్రం ఎక్కువగా ఉంటుంది. అయితే కింద చెప్పిన విధంగా హెర్బల్ డ్రింక్‌ను తయారు చేసి రోజూ తాగితే దాంతో 5 రోజుల్లోనే బరువును తగ్గించుకోవచ్చు. అలాగే పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరిగిపోతుంది. మరి ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలంటే..?
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో 2 టీస్పూన్ల మిరియాల పొడిని వేసి బాగా మరిగించాలి. 2 నిమిషాల పాటు మరిగాక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసి మరిగించాలి. తరువాత మరో 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. తరువాత 1 టీస్పూన్ అల్లంను మెత్తగా దంచి వేయాలి. అలాగే అర టీస్పూన్ పసుపును కూడా వేయాలి. అనంతరం మరో 5 నిమిషాల పాటు మరిగించాలి. ఈ విధంగా మరిగించాక దించి వడకట్టాలి. అనంతరం గోరు వెచ్చగా ఉండగానే ఈ డ్రింక్‌ను కప్పు మోతాదులో తాగాలి.
పైన తెలిపిన డ్రింక్‌ను తయారు చేసి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. తరువాత 40 నిమిషాల వరకు ఏమీ తాగరాదు, తినరాదు. బరువు, కొవ్వు ఎక్కువగా ఉన్నామని అనుకునే వారు.. రాత్రి నిద్రకు ముందు కూడా ఈ డ్రింక్‌ను తాగవచ్చు. దీంతో 5 రోజుల పాటు ఈ డ్రింక్‌ను తాగితే కచ్చితంగా మార్పు వస్తుంది.
అయితే మరీ అధికంగా బరువు, పొట్ట దగ్గరి కొవ్వు ఉన్నవారు 5 రోజుల అనంతరం 3 రోజులు గ్యాప్ ఇచ్చి మరో 5 రోజులు తాగవచ్చు. ఈ విధంగా ఈ డ్రింక్‌ను తాగుతుండడం వల్ల అధిక బరువు తగ్గడమే కాదు, పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.
మిరియాలు, దాల్చిన చెక్క, అఅ్లం, పసుపులలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వాపులు తగ్గడమే కాకుండా శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
వేడి శరీరం ఉన్నవారు రోజుకు ఒకసారి ఈ డ్రింక్‌ను తాగాలి. పైన తెలిపినవన్నీ వేడి చేసే పదార్థాలు. కనుక వేడి శరీరం ఉన్నవారు జాగ్రత్తగా దీన్ని తాగాల్సి ఉంటుంది. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే ఈ డ్రింక్‌ను తాగడం మానేయాలి.